CM Siddaramaiah: కర్ణాటక సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ప్రధాని నరేంద్రమోడీ టార్గెట్‌గా విమర్శలు చేశారు. బీజేపీలో తిరుగబాటు నాయకులను అదుపు చేయలేని బలహీన ప్రధానిగా ఆరోపించారు. శివమొగ్గలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు సిద్ధరామయ్య ప్రతిస్పందించారు. ‘‘ దోపిడిలో భాగస్వామ్యం కావడానికి కర్ణాటకలో పోటీ నెలకొంది. సీఎం-ఇన్-వెయిటింగ్, కాబోయే సీఎం ఆశావహులు, సూపర్ సీఎం, షాడో సీఎం ఇలా కాంగ్రెస్‌లో ఉన్నారు. చాలా మంది సీఎంల నడుమ ఢిల్లీలో కలెక్షన్ మినిస్టర్ ఉన్నారు’’ అంటూ కాంగ్రెస్ అధిష్టానంపై, కర్ణాటక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
Read Also: IVF Case: బిడ్డకు జన్మనిచ్చి చిక్కుల్లో పడిన సిద్దూ మూసేవాలా తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే.?
దీనికి ప్రతిస్పందనగా సిద్ధరామయ్య ఎక్స్ వేదిక ప్రధాని మోడీపై విమర్శలు చేశారు. ‘‘తిరుగుబాటు నాయకుడు ఈశ్వరప్పపై చర్యలు తీసుకోలేని బలహీన ప్రధాని అని, ప్రియమైన ప్రధాని నరేంద్ర మోదీ గారు, కాంగ్రెస్ పార్టీలో సూపర్ సీఎంలు, షాడో సీఎంలు ఉన్నారని మీరు చెప్పారు! మాకు సూపర్ లేదు, షాడో లేదు, ఒకే సీఎం ఉన్నారు. అది స్ట్రాంగ్ సీఎం, నేను మీలా వీక్ పీఎంని కాదు.’’ అంటూ ట్వీట్ చేశారు. ‘‘మీరు మిమ్మల్ని 56 అంగుళాల ఛాతి ఉన్న వ్యక్తిగా అభివర్ణించుకుంటారు. మీ అభిమానులు మిమ్మల్ని విశ్వగురు అని కొనియాడుతున్నారు. కానీ మిమ్మల్ని మీరు మళ్లీ మళ్లీ ‘‘వీక్ పీఎం’’గా చూపిస్తున్నారు’’ అంటూ విమర్శించారు.
మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఒకప్పుడు ఆయన నాయకత్వంపై తిరుగుబాటు చేశారని, దుర్భాషలాడారని ముఖ్యమంత్రి అన్నారు. అలాంటి వారి కాళ్లపై పడి, వారి మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చి ర్యాలీలు నిర్వహించి, మిమ్మల్ని మీరు బలహీన ప్రధానిగా చూపించలేదా..? అని సిద్ధరామయ్య ప్రశ్నించారు. కర్ణాటకలో మీ నాయకత్వంపై అరడజను మంది నాయకులు తిరుగుబాటు చేశారని, టిక్కెట్ల దొరక్క బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ వీధిన పడ్డారని సీఎం ఎద్దేవా చేశారు. శివమొగ్గలో మోడీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సమయంలో అక్కడే ఉన్న ఈశ్వరప్ప ఇంటికి ఎందుకు వెళ్లలేదని అన్నారు. ఈశ్వరప్ప నిరంతరం బీజేపీ నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోలేని వారిని వీక్ పీఎం కాకుంటే ఇంకేమంటారు అని సిద్ధరామయ్య ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని, సీఎం పదవికి అర్హులైన చాలా మంది నాయకులు ఉన్నారని, బీజేపీలో ప్రధాని అయ్యే అర్హత ఉన్న ఒక్క నాయకుడు కూడా లేదని విమర్శించారు.