Onion exports: ఉల్లి ఎగుమతుల కేంద్రం కీలక నిర్ణయం.. నిషేధం పొడగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Onion exports: సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై నిరవధికంగా నిషేధాన్ని పొడగించింది. ఈ పరిణామం పలు అంతర్జాతీయ మార్కెట్లలో అధిక ధరల్ని ప్రేరేపించనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద కూరగాయల ఎగుమతిదారుగా ఇండియా ఉంది. గత డిసెంబర్ నెలలో ఉల్లిపై కేంద్రం నిషేధం విధించింది, ఇది మార్చి 31 వరకు కొనసాగుతుంది. అయితే, ఈ నిషేధాన్ని మరోసారి పొడగించింది. ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో స్థానికంగా ధరలు సగానికి తగ్గాయి, కొత్తగా పంట అందుబాటులోకి వచ్చింది, దీంతో బ్యాన్ ఎత్తివేయొచ్చని వ్యాపారులు భావించారు.
Read Also: Sundaram Master : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘సుందరం మాస్టర్ ‘.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
తాజాగా విధించిన నిరవధిక నిషేధం, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగుతుందని ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఇలా బ్యాన్ విధించడం ఆశ్చర్యకరంగా ఉందని, అవసరం లేదని, ఇప్పటికే సఫ్లై పెరగడంతో ధరలు చాలా తగ్గాయని, కొత్త పంట కూడా అందుబాటులోకి వచ్చిందని ముంబైకి చెందిన ఓ ఎగుమతి సంస్థ చెప్పింది. దేశంలోనే పెద్ద మొత్తంలో ఉల్లిని ఉత్పత్తి చేసే మహారాష్ట్రలో హోల్ సేల్ మార్కెట్‌లో ఉల్లి ధర డిసెంబర్ నెలలో 100 కిలోలకు రూ. 4500 నుంచి ప్రస్తతం రూ. 1200కి పడిపోయింది.
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు దేశవ్యాప్తం 7 విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. మరోసారి ప్రధానిగా మోడీ అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. ఈ సమయంలో ఉల్లి ధరల్ని అదుపులో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్, మలేషియా, నేపాల్, యూఏఈ వంటి దేశాలు ఇండియా నుంచి దిగుమతులపై ఆధారపడుతాయి. ఈ నిషేధం తర్వాత ఆ దేశాల్లో ఉల్లి రేట్లు పెరిగే అవకాశం ఉంది. కొనుగోలుదారులకు వేరే మార్గం ఉండదు కాబట్టి, భారతదేశ చర్య ప్రత్యర్థి ఎగుమతిదారులు ఎక్కువ ధర కోట్ చేయడానికి అనుమతిస్తుందని ముంబైకి చెందిన ఓ ఎగుమతి కంపెనీ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. మార్చి 31, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారతదేశం రికార్డు స్థాయిలో 2.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను ఎగుమతి చేసింది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!