Heatwave: వేసవి ఎండలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ మాసం రాకముందే దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ఏడాది వేసవి కాలంలో వేడిగాలులు, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసిన నేపథ్యంలో ఓటర్ల భద్రత కోసం లోక్‌సభ ఎన్నికల ముందు భారత ఎన్నికల సంఘం(ఈసీ) ఈరోజు కీలక సూచనలు జారీ చేసింది.
Varun Gandhi: బీజేపీ నేత వరుణ్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ స్వాగతం పలుకుతోంది. తమ పార్టీలో చేరాలని సూచిస్తోంది. ఇటీవల బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల 5వ జాబితాలో వరుణ్ గాంధీని తప్పించింది.
టెలికాం సేవలందిస్తున్న కంపెనీలు తమ వినియోగదారులపై మరోసారి భారం మోపడానికి రెడీ అయ్యారు. లోక్ సభ ఎన్నికల తర్వాత టారిఫ్ ఛార్జీలను పెంచాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) పార్టీ రానున్న లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను నేడు విడుదల చేయనుంది. ఈ జాబితాలో 15 నుంచి 16 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించే అవకాశం ఉంది.
అసోంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. లఖింపూర్ జిల్లాలోని నవోబోయిచా ఎమ్మెల్యే భరత్ చంద్ర నారా, తన భార్యకు లోక్‌సభ సీటు ఇవ్వలేదని ఇవాళ (సోమవారం) హస్తం పార్టీకి రాజీనామా చేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి భయం.. అందుకే ఆయనను అరెస్ట్ చేయించారని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు.