బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఎంపీ అభ్యర్థి కడియం కావ్య లేఖ రాశారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు లేఖలో కడియం కావ్య తెలిపారు.
తెలంగాణ బీజేపీ నేతలకు ఢిల్లీ నుంచి తలంటు స్నానాలు అవుతున్నాయా? నేరుగా పచ్చి బూతులు తిట్టడం ఒక్కటే మిగిలిపోయిందా? ఎంత చెప్పినా మీరు మారరా... అంటూ జాతీయ ప్రధాన కార్యదర్శి డ్యాష్ డ్యాష్ అనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? లోక్‌సభ ఎన్నికల వేళ టీ బీజేపీలో ఏం జరుగుతోంది?
Savitri Jindal: కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ నవీన్ జిందాల్ ఇటీవల ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. హర్యానా కురుక్షేత్ర నుంచి బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ పరిణామం జరిగిన కొద్ది రోజులకే ఆయన తల్లి, హర్యానా మాజీ మంత్రి సావిత్రి జిందాల్ కూడా బీజేపీలో చేరారు.
Voting Rule: తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అర్హులైన ఓటర్లను పోలింగ్ స్టేషన్‌కి తీసుకురావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఎన్నికల సంఘం చెబుతోంది. ఇదే తరుణంలో పోలింగ్ బూత్‌లో ప్రిసైడింగ్ అధికారి ముందు తన గుర్తింపును నమోదు చేసుకున్న తర్వాత కూడా ఓటేయడానికి నిరాకరించిన ఓటర్లను అధికారులు బలవంతం చేయలేరని ఓటింగ్ రూల్స్ తెలియజేస్తున్నాయి.
తాను ఈ గడ్డ బిడ్డనని.. తనకు ఇక్కడి సమస్యలపై పూర్తి అవగాహన ఉందని ఖమ్మం బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
Mood of the Nation: లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రజలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమినే కోరుకుంటున్నారు. 79 శాతం ప్రజలు బీజేపీ సర్కార్‌కే మొగ్గు జై కొడుతున్నారని ఆసియా నెట్ ‘‘మూడ్ ఆఫ్ ది నేషన్’’ సర్వే వెల్లడించింది.
Yusuf Pathan: మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) తరుపున ఆయన వెస్ట్ బెంగాల్‌లోని బర్హంపూర్ నుంచి పోటీ చేస్తున్నారు.
Himanta Biswa Sarma: బీజేపీ నేత, అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 తర్వాత కాంగ్రెస్ పార్టీలో హిందువులు ఎవరూ ఉండరని, 2032 నాటికి ముస్లింలు కూడా ఆ పార్టీని వదిలి వెళ్తారని అన్నారు.