Rythu Runamafi: రూ. 2 లక్షల రుణమాఫీ అయినోళ్లు కాంగ్రెస్కి ఓటెయ్యండి.. కానోళ్లు బీఆర్ఎస్కు వేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చేవెళ్ల సభలో ఒక్క సీటు గెలువు అని రేవంత్ రెడ్డి అన్నాడు.. నేను సవాల్ విసిరిన.. ఇద్దరం మల్కాజిగిరిలో పోటీ చేద్దాం అని కేటీఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డి సప్పుడు జేస్తలేడు.. ఓడిపోతా అని భయం.. ఇంకా ఎలక్షన్స్ కు టైం ఉంది.. రా పోటీ చేద్దాం.. రేవంత్ కు నరుకుడు ఎక్కువ.. పెద్ద పెద్ద మాటలు తప్ప చేసేదేం లేదు.. రేపు జరుగుతున్న పోటీ వ్యక్తుల మధ్య కాదు.. మూడు పార్టీల మధ్య అని ఆయన చెప్పుకొచ్చారు. మల్కాజిగిరి పరిధిలో ఒక్కో అభ్యర్థికి తుఫాన్ లాగా మెజార్టీ వచ్చింది.. నువ్వు ఎంపీగా ఉండి ఒక్క కాలనీలో తిరగలేదు.. గులాబీ కుటుంబ సభ్యులం అందరం కష్టపడాలి.. పదేళ్ల నిజానికి.. పదేళ్ల విషానికి.. వంద రోజుల అబద్దానికి మధ్య పోటీ జరుగుతుందన్నారు. పదేళ్ల నిజం బీఆర్ఎస్, పదేళ్ల విషం బీజేపీ, ఇక వంద రోజుల అబద్ధం కాంగ్రెస్ అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
Read Also: BiggBoss Winner Arrested: బిగ్ బాస్ విజేత మునావర్ ఫరూఖీ అరెస్ట్.. హుక్కా తాగుతూ..?
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
రాష్ట్రంలో కరువు వస్తే ఒక్క ఎమ్మెల్యే కూడా రైతుల దగ్గరికి పోలేదు అని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలనే ఇస్తున్నారు.. అని యువకులు ఆగ్రహంగా ఉన్నారు.. రైతులు, మహిళలు అందరూ కోపంతో ఉన్నారు.. హైదరాబాద్ ప్రజలు బాధ పడుతున్నారు.. వీళ్లు ఎట్లా గెలిచారని.. రేవంత్ రెడ్డి మాటలకు బాధపడుతూ నాకు యువకులు మెసేజేలు చేస్తున్నారు.. రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే యూట్యూబ్ లో మొరిగే కుక్కల దాకా మనం గెలివాలి అని ఆయన మండిపడ్డారు. ఓటుతో మనం వేసే వేటే వీళ్లకు సమాధానం కావాలి.. నా కొడకల్లారా అని మాట్లాడుతాడు.. పేగులు మెదలేసుకుంటా అంటాడు.. లంకెబిందెలు ఉన్నాయని వస్తే వట్టి కుండలు ఉన్నాయని అంటున్నారు.. లంకబిందెల కోసం దొంగలు వెతుకుతారు.. జేబుల కత్తెర పెట్టుకుని తిరుగుతా అంటున్నాడు.. గీసుంటోడు ఎడ నుంచి మోపైండో అని మాకు కూడా బాధ అవుతుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: MS Dhoni Batting: రెండు మ్యాచ్‌లలో బ్యాటింగ్‌కు రాని ఎంఎస్ ధోనీ.. కారణం ఏంటంటే?
అయితే, వంద కిలో మీటర్ల స్పీడ్ తో కార్ ఉరుకాలే.. మల్కాజిగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ లో గెలవాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ఒకటి అంటాడు, రేవంత్ రెడ్డి ఒకటి అంటాడు.. కేజ్రీవాల్ అరెస్ట్ కరెక్ట్ కాదు అని రాహుల్ గాంధీ అంటాడు.. రేవంత్ రెడ్డి ఏమో కవితను అరెస్ట్ చేసుడు కరెక్ట్ అంటాడు.. రాహుల్ గాంధీ లిక్కర్ స్కామ్ లేదు ఫేక్ అంటాడు.. రేవంత్ ఏమో లిక్కర్ స్కామ్ జరిగింది అంటాడు అని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత బీజేపీలోకి రేవంత్ వెళ్తాడు.. పాపం ఈటెల రాజేందరన్న మొన్న మాట్లాడిండు.. రాజేందరన్న నువ్వు బీజేపీలో ఉన్నావు.. బీఆర్ఎస్ లో కాదు.. రుణమాఫీ గురించి మీరు కాదు మాట్లాడాల్సింది.. 14 లక్షల కోట్లు ఎవరుకి మాఫీ చేశారు.. మల్కాజిగిరికి మోడీ ఏం చేశాడు ఈటెల చెప్పాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Read Also: Konda Surekha: కవితను అరెస్టు చేయడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు..
ఇక, 40 కోట్ల రూపాయలు తీసుకుని లిక్కర్ స్కామ్ లో ఒకాయనను తప్పించారు అని కేటీఆర్ అన్నారు. ఐదేళ్లు కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఏం చేశాడు.. కుర్ కురేలు పంచుతాడు.. లిఫ్టులు ఓపెన్ చేస్తాడు.. సింటెక్స్ ట్యాంక్ లు ప్రారంభిస్తాడు.. తెలంగాణకు కిషన్ రెడ్డి ఏం తెచ్చాడో చెప్పాలి అని డిమాండ్ చేశారు. బండి సంజయ్ ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలీదు.. పాపం.. అయితే, ఉంటే బీజేపీ జేబులో ఉండాలి.. లేదంటే జైల్లో ఉండాలి.. ఇదే మోడీ తీరు అని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో పరిశ్రమలను బెదిరించి రాహుల్ గాంధీకి కప్పం కడుతుండు.. ఇక, రెండు లక్షల రుణమాఫీ అయినోళ్లు అంతా కాంగ్రెస్ కి ఓటెయ్యండి.. రుణమాఫీ కానోళ్లంతా BRSకు వేయండి అన్నారు. గుజరాత్ మోడల్ ని రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తే.. రేవంత్ తెలంగాణను గుజరాత్ మోడల్ చేస్తా అంటాడు.. గుజరాత్ మోడల్ అంటే మత అల్లర్లు సృష్టించడమా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!