MK Stalin: తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. అధికార డీఎంకే, బీజేపీ మధ్య విమర్శల దాడి జరుగుతోంది. సీఎం ఎంకే స్టాలిన్ బీజేపీ, ప్రధాని మోడీ టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు.
Rahul Gandhi: మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా బీజేపీ చెబుతున్నా 400 సీట్లు సాధ్యమా..? అని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. 400 సీట్లు సాధించేందుకు ప్రధాని ‘అంపైర్లను’ ఎంచుకున్నారని ఆరోపించారు.
Mamata Banerjee: లోక్‌సభ ఎన్నికల్లో 400కి పైగా సీట్లను సాధించాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి టార్గెట్ పెట్టుకుంది. స్వతహాగా బీజేపీ 370 స్థానాలను సాధించాలని అనుకుంటోంది.
Congress: లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి వరసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఇతర పార్టీల్లో చేరుతున్నారు
Tejaswini Gowda: లోక్‌సభ ఎన్నికల ముందు కర్ణాటకలో బీజేపీకి షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన నెల తర్వాత, బీజేపీకి చెందిన తేజస్విని గౌడ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో చేరుతున్న క్రమంలో ఆమె బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీకి రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపై నమ్మకం లేదని ఆరోపించారు.
Kamal Haasan: నటుడు-రాజకీయ నాయకుడు కమల్ హాసన్ బీజేపీ, కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోడ్ ఎంపీ స్థానంలో పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి కేఈ ప్రకాష్‌కి మద్దతుగా ప్రచారం చేశారు. తమిళనాడుకు కేంద్రం ఇస్తున్న పన్నుల వాటాను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. కేంద్రం ప్రభుత్వానికి అందించిన ప్రతీ రూపాయిలో కేవలం 29 పైసలు మాత్రమే రాష్ట్రానికి తిరిగి వస్తున్నట్లు ఆరోపించారు.
జమ్మూ కాశ్మీర్‌లో జరిగే ఎన్నికలకు 27 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ (INC) ఇవాళ (శనివారం) విడుదల చేసింది. ఐదు దశల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈ నేతలు జమ్మూ కాశ్మీర్‌లో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ్య క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేశారు. గుజరాత్‌లోని పోరుబందర్‌లో ఆయన స్థానికులతో కలిసి కాసేపు గ్రౌండ్ లో క్రికెట్ ఆడారు.