సంక్షేమ పథకాల లబ్దిదారులకు నగదు జమ చేయకుండా ఆపాలన్న ఈసీ నిర్ణయంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యాదీవెన, ఆసరా, ఈబీసీ నేస్తం ఇన్‌పుట్ సబ్సిడీ, చేయూత నిధులను ఎన్నికలు పూర్తయ్యే వరకు విడుదల చేయొద్దన్న ఎన్నికల సంఘం ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది.
Amit Shah: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని, ముస్లిం రిజర్వేషన్లను అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి గురువారం ప్రకటించారు.
గత 25 ఏళ్లుగా మెదక్ పార్లమెంటు బీజేపీ, బీఆర్‌ఎస్ చేతిలో నలిగిపోయిందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ నర్సాపూర్‌లో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అందుకే రాహుల్ గాంధీ నీలం మధుని మెదక్ నుంచి బరిలో నిలిపారని, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుని దుబ్బాకలో బండకేసి కొడితే ఇక్కడికి వచ్చారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్‌ఎస్ అభ్యర్థి మల్లన్నసాగర్ లో…
Lok Sabha elections: 1993 ముంబై పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న ఇబ్రహీం ముసా కాంగ్రెస్-శివసేన(ఉద్ధవ్)-ఎన్సీపీ(శరద్ పవార్)ల ‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’ కూటమి అభ్యర్థి తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం వివాదాస్పదమైంది.
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ తార్నాక డివిజన్‌లో ఎన్నికల పాదయాత్ర నిర్వహించారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర యువజన విభాగం నేతలతో కలసి ఆయన మాణికేశ్వరి నగర్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌పై ఈడీ రేపు చార్జిషీట్ దాఖలు చేయనుంది.