నేటి రాత్రి 8 గంటలకు ప్రధాని ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు ప్రధాని మోడీ. ఇదే విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా తన ఎక్స్(గతంలో ట్విట్టర్) అకౌంట్ ద్వారా పంచుకున్నారు.
జేపీ ప్రచారం జోరు పెంచింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ఎల్‌బీ స్టేడియంలో జరగనున్న సభకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలుంటాయని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
కర్ణాటకలో తీవ్ర కలకలం రేపిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ కేసులో ఊహించని ట్విస్ట్ నెలకొంది. జాతీయ మహిళా కమిషన్ గురువారం మాట్లాడుతూ.. ఈ కేసులో ఫిర్యాదు చేసిన మహిళల్లో ఒకరు తనను బెదిరించి రేవణ్ణపై తప్పుడు ఆరోపణలు చేయించారని తమతో చెప్పినట్లు కమిషన్ చెప్పుకొచ్చింది.
ఖలిస్తాన్ మద్దతుదారు అమృత్‌పాల్ సింగ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా తాత్కాలికంగా విడుదల చేయాలని కోరుతూ ఇవాళ ( మే10) పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించాడు.
ఓ మహిళ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో గురువారం బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ సాధారణ పౌరులకు ఈ నెల 2వ తేదీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ విజువల్స్ ను చూపించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి ఇంకా 2 రోజులే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి పార్టీలు. ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి విమర్శలతో అభ్యర్థులు విరుచుకుపడుతున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు తీర్పును వెల్లడించనుంది. ఈ పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పును రిజర్వ్ లో ఉంచింది.
నాలుగో విడత ఎన్నికల ప్రచారం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ (శుక్రవారం) మరోసారి పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్నారు. ఈ రోజున అసన్‌సోల్, రాంపూర్‌హాట్, రానాఘాట్‌లలో మూడు చోట్ల బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ రానున్నారు. నేటి మధ్యాహ్నం 2 గంటలకు నారాయణపేటలో.. అలాగే, సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.