ప్రభుత్వ ఉద్యోగులు సైతం భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతున్నారని చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవాళ (బుధవారం) ఉదయం ఆయన మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల పాకిస్థాన్ కు చెందిన మాజీ మంత్రి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
Sam Pitroda : కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా ఇటీవల మధ్యంతర ఎన్నికలలో వనరుల పునర్విభజన, వారసత్వ పన్ను గురించి మాట్లాడటం ద్వారా కొత్త అంశాన్ని లేవనెత్తారు. తన ప్రకటనను చేతిలోకి తీసుకున్న ప్రధాని మోడీ కూడా కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వారసత్వ పన్ను (ఆస్తి విభజన) విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అంశంపై ప్రస్తుతం రాజకీయ గందరగోళం నెలకొంది. ప్రధాని మోడీ తన ఎన్నికల ర్యాలీలలో వారసత్వ పన్నును ప్రస్తావిస్తూ కాంగ్రెస్, రాహుల్ గాంధీని నిరంతరం టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశప్రజల ఆస్తిలో సగం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని బీజేపీ ఆరోపిస్తోంది.
ఇవాళ (బుధవారం) ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. చివరిదైనా ఏడో దశలో దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనున్నట్లు షెడ్యూల్ రూపొందించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాల్లో హోరెత్తుతోంది. ఇక మిగిలింది 4 రోజులే ఉండడంతో ఢిల్లీ నుంచి అగ్రనేతలు మొదలుకొని రాష్ట్రంలోని స్టార్ క్యాంపెయినర్లు అంతా ప్రచార రంగంలోకి దూకారు. పోటాపోటీగా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లతో దూసుకుపోతున్నారు.
బహుజన్ సమాజ్ పార్టీ ( బీఎస్పీ) అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకుంది. తన రాజకీయ వారసుడిగా, పార్టీ జాతీయ సమన్వయకర్తగా తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను తొలగిస్తున్నట్లు వెల్లడించింది.
పోలింగ్ సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బస్సులో నుంచి బయటకు దూకిన సిబ్బంది ప్రాణాలు దక్కించుకున్నారు. మధ్య ప్రదేశ్ లోని బేతుల్ జిల్లా గౌలా గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.