CM Revanth Reddy : దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెలో ఉండాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత 25 ఏళ్లుగా మెదక్ పార్లమెంటు బీజేపీ, బీఆర్‌ఎస్ చేతిలో నలిగిపోయిందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ నర్సాపూర్‌లో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అందుకే రాహుల్ గాంధీ నీలం మధుని మెదక్ నుంచి బరిలో నిలిపారని, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుని దుబ్బాకలో బండకేసి కొడితే ఇక్కడికి వచ్చారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్‌ఎస్ అభ్యర్థి మల్లన్నసాగర్ లో వేలాది మంది రైతుల భూములను గుంజుకున్నాడని, మన భూములు గంజుకున్న వెంకట్రామిరెడ్డి ని ఓడించాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్, హరీష్ రావుకు వందల కోట్లు ఇచ్చినందుకే వెంకట్రామిరెడ్డి కి టికెట్ ఇచ్చారని, మెదక్ లో ఒక్కమగాడు కూడా కేసీఆర్ కి దొరకలేదా అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా..’మోడీ రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర చేస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు రాముడు, హనుమాన్ జయంతి లు బీజేపీ వాళ్లకు గుర్తుకి వస్తాయి. మనం తాత, ముత్తాతల నుంచి మనం పండుగలు చేయలేదా. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెలో ఉండాలి. ఓట్ల కోసం బిచ్చగాడిలా ఆడుకుంటున్నారు. కేసీఆర్ బస్సు యాత్ర పిచ్చోడు తిరనాళ్ళకి వెలితే ఎక్కిదిగడానికే సరిపోయింది అన్నట్టు ఉంది. మోడీ మనకు గాడిద గుడ్డు ఇచ్చాడు. గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీని కర్రు కాల్చి వాత పెట్టాలి. నీలం మధుని లక్ష మెజార్టీతో గెలిపించాలి’ అని సీఎం రేవంత్ అన్నారు.
Also Read
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
- Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
తాజావార్తలు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?