PM Modi: పశ్చిమ బెంగాల్‌లో ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీలపై విరుచుకుపడ్డారు. సందేశ్‌ఖాలీలో టీఎంసీ నాయకులు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఇప్పుడు ఆ పార్టీ గుండాలు వారిని బెదిరిస్తున్నారని మోడీ ఆరోపించారు. రాహుల్ గాంధీ 53 ఏళ్ల వయసును ప్రస్తావిస్తూ.. ఈ సారి కాంగ్రెస్ పార్టీకి యువరాజు వయసు కన్నా తక్కువ సీట్లే వస్తాయని అన్నారు.
Read Also: POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో స్వేచ్ఛ కోసం పోరాటం.. భారీగా నిరసనలు..
నార్ 24 పరగణాస్ జిల్లాలోని బరాక్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ.. టీఎంసీ పాలనలో రాష్ట్రంలోని హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులుగా మారారని ప్రధాని మోడీ ఆరోపించారు. మోడీ ఉన్నంత వరకు సీఏఏ చట్టాన్ని రద్దు చేయలేరని అన్నారు. సందేశ్‌ఖాలీలో మహిళలపై టీఎంసీ ఏం చేసిందో మనమందరం చూశాం, ప్రధాన నిందితుడు షేక్ షాజహాన్ పేరు చెప్పి టీఎంసీ గుండాలు ఇప్పడు మహిళల్ని బెదిరిస్తున్నారని ప్రధాని ఆరోపించారు. టీఎంసీ పాలనలో బెంగాల్ అవినీతికి కేంద్రంగా మారిందని, బాంబుల తయారీ కుటీర పరిశ్రమగా మారిందని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల ముందు రాష్ట్ర పాలన యంత్రాంగం లొంగిపోయిందని అన్నారు.
బెంగాల్‌లో ఓటు బ్యాంకు రాజకీయాల ముందు శ్రీరాముడి పేరు చెప్పకోలేమని, రామ నవమి జరుపులోనమని అన్నారు. టీఎంసీ పాలనలో బెంగాల్ హిందువుల పరిస్థితి ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చబడ్డారని ఆయన అన్నారు. హుగ్లీలో జరిగి మరో ర్యాలీలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యం ఆల్ టైం కనిష్ట స్థాయికి చేరుతుందని ప్రధాని అన్నారు. రామ మందిర నిర్మాణం తర్వాత ఆ పార్టీకి నిద్ర కరువైందని, రామ మందిరాన్ని కూడా బహిష్కరించారని, రామ మందిరం కోసం 500 ఏళ్ల పోరాటం చేసిన మన పూర్వీకుల ఆత్మలు ఈ కాంగ్రెస్, టీఎంసీల చేష్టల్ని చూస్తున్నారని, మీ పూర్వీకులు త్యాగాన్ని అవమానించొద్దని ప్రధాని మోడీ అన్నారు. రాముడిని బహిష్కరించడం బెంగాల్ సంస్కృతి కాదని చెప్పారు.