ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సరిహద్దు్ల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
తెలంగాణలో ప్రచార పర్వం ముగిసింది. ఇక 13న జరిగే పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు... సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ కూడా జరుగుతుంది. రాష్ట్రంలో మొత్తం 3.32 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో సగానికి పైగా మహిళా ఓటర్లే ఉన్నారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాలకుగాను 13 నియోజక వర్గాల్లో మహిళ ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల 809 పోలింగ్ కేంద్రాలు…
మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ములుగు జిల్లాలో పోలింగ్ కు సర్వం సిద్దంమైందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిని ఇలా త్రిపాఠి తెలిపారు. ఇక, ములుగు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనున్నట్లు చెప్పారు.
ఒక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే 10 లక్షలకు పైగా యువ ఓటర్లు.. తొలి సారి తమ ఓటు హక్కును వేయబోతున్నారు. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే, తెలంగాణలోని యువ ఓటర్లు సైతం ఎవరికి మద్దతు ఇస్తారనే కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది.
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఎలక్షన్ డ్యూటీ ట్రైనింగ్‌ను దాటేసినందుకు 93 మంది ప్రభుత్వ ఉద్యోగులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయనున్నారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా చట్టపరమైన చర్య ప్రారంభించబడింది.
Himanta Biswa Sarma: దేశంలో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలు చేయడానికి, మథురలో శ్రీకృష్ణ జన్మస్థాన్‌లో గొప్ప ఆలయాన్ని నిర్మించేందుకు లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే 400 సీట్లకు పైగా గెలవాలని అస్సా సీఎం హిమంత బిశ్వ సర్మ శనివారం అన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో కుమారుడు వరుణ్ గాంధీకి టికెట్ దక్కకపోవడంపై తొలిసారి తల్లి మేనకాగాంధీ స్పందించారు. వరుణ్‌పై తనకు విశ్వాసం ఉందని.. సమర్థవంతుడైన నాయకుడు అని కొనియాడారు.
వికారాబాద్ జిల్లాలోని తాండూరు లో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లా గడ్డపైన కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి ప్రియాంక గాంధీ వచ్చారని, ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దబోతున్నాయని అన్నారు. వికారాబాద్ జిల్లాలో ఎన్ని అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుందని, వికారాబాద్ జిల్లా కు ముఖ్యమంత్రి పదవి,…