PM Modi: మరోసారి ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. ఒడిశాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్‌కి ప్రతిపక్ష హోదా కూడా రాదని అన్నారు.
వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాండూరుకు వచ్చినందుకు నాకు సంతోషంగా ఉందని, చిలుకూరు బాలాజీ ఉన్న పవిత్ర ప్రాంతం ఇది.. నాకు ఈ ప్రాంతం అంటే ప్రేమ ఉందని ఆమె అన్నారు. ఇందిరా గాంధీ కి మీరంతా ప్రేమను పంచారని, నా తల్లి సోనియా గాంధీని మీరు సోనియమ్మ అంటూ ప్రేమతో పిలిచి తల్లి పాత్ర ఇచ్చారన్నారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని…
మరో గంటలో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం ముగుస్తుందని సీఈఓ వికాస్ రాజ్ అన్నారు. మిగతా 106 నియోజకవర్గంలో 6 గంటల తర్వాత ప్రచారం ముగుస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని జిల్లాల్లో 144 సెక్షన్ విధిస్తారని ఆయన వెల్లడించారు. ఎలాంటి రాజకీయ పార్టీల చిహ్నాలు టీవీల్లో ప్రసారం చేయొద్దని ఆయన తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన బల్క్ sms లు నిషేధమని, జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ నిషేధమని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని…
Arvind Kejriwal: ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీపై విరుచుకుపడ్డారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిన్న తీహార్ జైలు నుంచి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విడుదలయ్యారు. ఆయన జూన్ 1 వరకు లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నారు.
పదేళ్ల నిజం కేసీఆర్ పాలన, పదేళ్ల విషం బీజెపీ పాలన.. 150 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి పాలన అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం వీటి మధ్యనే పోటీ జరుగుతుందని స్పష్టం చేశారు. కేసీఆర్ మాట్లాడుతూ.."నరేంద్రమోడీ వస్తె కాలేజులు కట్టిన, రోడ్లు వేసిన అని చెప్పాలే.
ఈసారి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, కేరళ సీఎం పినరయి విజయన్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఇతర ప్రతిపక్ష నేతలంతా జైల్లో ఉంటారని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
రోజు రోజుకు బీజేపీ పట్ల సానుకూలత పెరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. సికింద్రాబాద్ లో ఆయన మాట్లాడుతూ.. కంటోన్మెంట్ లో ఓటుకు రూ. 2000 పంచుతూ ప్రజలను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు.