సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీలోకి వలసలు జెట్ స్పీడ్‌గా సాగుతున్నాయి. ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలు కమలం గూటికి చేరుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచి చేరికలు జోరుగా సాగుతున్నాయి. కాంగ్రెస్, ఆయా రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల నేతలు పువ్వు పార్టీలో చేరుతున్నారు. సోమవారం బీఎస్పీ ఎంపీ సంగీతా ఆజాద్ బీజేపీ గూటికి చేరగా… తాజాగా జార్ఖండ్‌కు చెందిన జేఎంఎం ముఖ్య నేత సీతా సోరెన్ కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. అదే బాటలో మరొక ముఖ్య నేత కూడా బీజేపీలో చేరారు. అమెరికాకు భారతీయ అంబాసిడర్‌గా చేసిన తరన్‌జిత్ సింగ్ సంధూ కొద్ది సేపటి క్రితమే పువ్వు పార్టీలో చేరారు.
గతంలో అమెరికాకు భారతీయ అంబాసిడర్‌గా చేసిన తరన్‌జిత్ సింగ్ సంధూ మంగళవారం బీజేపీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరపున పంజాబ్‌లోని అమృత్‌సర్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధాన కార్యదర్శులు వినోద్ తవడే, తరుణ్ చుగ్ సమక్షంలో సంధూ పువ్వు పార్టీ చేరారు.
అమెరికా-భారత్ మధ్య బంధం బలోపేతం అయ్యిందని సంధూ తెలిపారు. రెండు దేశాల మధ్య అభివృద్ధిపై ఫోకస్ చేశామని.. సెమీకండక్టర్ పరిశ్రమలో ఇంకా వృద్ధి సాధించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. తన రాజకీయ ఇన్నింగ్స్‌కు అవకాశం ఇచ్చిన ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మరికొద్ది రోజుల్లో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేఫన్ విడుదల చేసింది. ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ ప్రారంభమై.. జూన్ 1న ఏడో విడత పోలింగ్ ముగియనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Tirumala: రేపటి నుంచి తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు..
ఇదిలా ఉంటే ఈసారి ఎన్డీఏ కూటమికి 400 సీట్లు కట్టబెట్టాలని ప్రధాని మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా సౌతిండియాపై దృష్టి పెట్టిన మోడీ.. కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అభివృద్ధి కోసం, వికసిత్ భారత్ కోసమే ఎన్డీఏకు 400 సీట్లు ఇవ్వాలని దేశ ప్రజలకు మోడీ విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Rajamouli: RRR సీక్వెల్ పై రాజమౌళి క్లారిటీ.. హీరోలు ఒప్పుకుంటారా?
#WATCH | India's former Ambassador to the US, Taranjit Singh Sandhu joins the BJP, in Delhi. pic.twitter.com/krYAqi0FjX
— ANI (@ANI) March 19, 2024