పశ్చిమ బెంగాల్‌లో పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో 12 మంది లోక్‌సభ అభ్యర్థుల పేర్లను ఎంపిక చేసింది. బెంగాల్‌లో మొత్తం 42 స్థానాలు ఉండగా.. ప్రస్తుతానికి 12 మంది అభ్యర్థులనే డిసైడ్ చేసింది.
ఇండియా కూటమిలో తృణమూల్ కాంగ్రెస్ కూడా ఉంది. అయితే బెంగాల్‌లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆమె ప్రకటించారు. దీంతో పశ్చిమ బెంగాల్‌లో ఉన్న 42 స్థానాలకు అభ్యర్థులను బహిరంగ సభలో ప్రకటించి.. పరిచయం చేసింది. దీంతో చేసేదేమీ లేక కాంగ్రెస్ కూడా తన అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. మంగళవారం జరిగిన కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకూ 82 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మార్చి 8న విడుదల చేసిన తొలి జాబితాలో 39 మంది అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో రాహుల్ గాంధీ, డీకే సురేష్, శశిథరూర్ వంటి కీలక నేతలు ఉన్నాయి. మార్చి 12న విడుదల చేసిన రెండో జాబితాలో 43 మంది అభ్యర్థులను వెల్లడించింది. ఇందులో గౌరవ్ గొగోయ్, నకుల్ నాథ్, వైభవ్ పటేల్ వంటి నేతలు ఉన్నారు.
ఇది కూడా చదవండి: Zomato: ‘‘ప్యూర్ వెజ్ మోడ్’’ని ప్రారంభించిన జొమాటో.. వారి కోసం ప్రత్యేకం..
మంగళవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ప్రధానంగా అభ్యర్థుల ఎంపికతో పాటు లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోపై ప్రధానంగా చర్చ జరిగింది. పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, అంబికా సోని, ప్రియాంక గాంధీ వాద్రా, పి.చిదంబరం, దిగ్విజయ్ సింగ్, అజయ్ మాకెన్, కుమారి సెల్జా, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు తదితరులు హాజరయ్యారు.
పాంచ్ న్యాయ్ పేరుతో 5 అంశాలతో మేనిఫెస్టోను సీడబ్ల్యూసీ సమావేశంలో ఖరారు చేసినట్టు చెబుతున్నారు. హిస్సేదారి న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్, నారీ న్యాయ్ పేరుతో ఈ మేనిఫెస్టోను రూపొందించారు. ఇటీవల మహిళలు లక్ష్యంగా మరికొన్ని పథకాలను ఖర్గే ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Kanna Lakshminarayana: ప్రజాగళం సభకు అడ్డుకునే ప్రయత్నం చేశారు..
త్వరలో దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేఫన్ విడుదల చేసింది. ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ ప్రారంభమై.. జూన్ 1న ఏడో విడత పోలింగ్ ముగియనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
Congress holds CEC meeting, finalises candidates for 12 Lok Sabha seats in West Bengal
Read @ANI Story | https://t.co/krEWlJGKsv#Congress #WestBengal #CECmeeting pic.twitter.com/hngE93Julo
— ANI Digital (@ani_digital) March 19, 2024