Tamilisai Soundarajan: బీజేపీలో చేరిన తమిళిసై.. పోటీ ఎక్కడ నుంచంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సుందరరాజన్ బీజేపీలో చేరారు. బుధవారం చెన్నైలో ఆమె కమలం పార్టీలో చేరారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలో తమిళిసై పువ్వు పార్టీలో చేరారు. ఆమె మెడలో కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలలో స్థానిక బీజేపీ నేతలు పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే ప్రధాని మోడీ తెలంగాణలోని జగిత్యాల్ జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు గవర్నర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపగానే ఆమోదించారు. అలాగే మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కూడా రాజీనామా లేఖను పంపించారు.
Also Read
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె రాజీనామా చేశారు. ప్రజాసేవ చేసేందుకు తాను స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లు తమిళిసై వెల్లడించారు. నిజాయితీ రాజకీయాలు చేసేందుకు తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆమె తెలిపారు.
తమిళిసై.. గతంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా పని చేశారు. రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉండేవారు. 2011, 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పరాజయం పాలయ్యారు. ఇక 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే నాయకురాలు కనిమొళి చేతిలో తమిళిసై ఓడిపోయారు. గత ఏడాది నుంచి తమిళిసై తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారని వార్తలు వినిపించాయి. మొత్తానికి గవర్నర్ పదవికి రాజీనామా చేసి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణలో తమిళిసై పదవీకాలం మరో ఆరు నెలలు, పుదుచ్చేరిలో మరో రెండేళ్లు ఉంది.
ఇదిలా ఉంటే బీజేపీ మూడో జాబితా త్వరలో విడుదలకానుంది. తొలి విడతలోనే తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. బుధవారమే తొలి నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఫస్ట్ ఫేజ్‌లోనే తమిళనాడు ఎన్నికలు ఉండడంతో తమిళిసై పేరు మూడో జాబితాలో ఉండనుంది. ట్యూటికోరిన్ నియోజకవర్గం నుంచే తమిళిసై మళ్లీ పోటీ చేయొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదలైంది. ఫస్ట్ ఫేజ్ ఏప్రిల్ 19న ప్రారంభం కాగా… జూన్ 1న ఏడో విడత పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. బుధవారం తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
Former Telangana Governor Tamilisai Soundarajan joins BJP
Read @ANI Story | https://t.co/lJa9QyPnag#TamilisaiSoundarajan #BJP #TamilNadu pic.twitter.com/vy2GmW6ULv
— ANI Digital (@ani_digital) March 20, 2024
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు