ఐటీ శాఖకు బీజేపీ సుమారు 4600 కోట్ల రూపాయల పెనాల్టీ కట్టాల్సి ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపలు గుప్పించింది. ఆ డబ్బును వసూల్ చేసేందుకు బీజేపీకి ఆదాయపు పన్ను శాఖ డిమాండ్ నోటీసు ఇవ్వాలని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ పేర్కొన్నారు. మేం పాల్పడిన ఉల్లంఘనలను సమీక్షించేందుకు ఎలాంటి అంచనాలు చేశారో.. అలాగే బీజేపీ ఉల్లంఘనలను తాము కూడా స్టడీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దాని ప్రకారం బీజేపీ 4600 కోట్ల రూపాయల జరిమాన కట్టాల్సి ఉంటుంది అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, కాంగ్రెస్ పార్టీ 1700 కోట్ల రూపాయల ఫైన్ కట్టాలని తాజాగా ఐటీ శాఖ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ వివాదం కొనసాగుతుంది. తమకు ఇచ్చిన పన్ను పెనాల్టీ నోటీసుపై మూడు సార్లు సుప్రీంకోర్టును ఆశ్రయించామన్నారు.. ఈ కేసులో తదుపరి విచారణ ఏప్రిల్ ఒకటో తేదీన ఉందని అజేయ్ మాకెన్ అన్నారు.
Read Also: Sunitha Kejriwal : కేజ్రీవాల్‌కు ఆశీర్వాద ప్రచారం.. వాట్సాప్ నంబర్ రిలీజ్ చేసిన సునీతా కేజ్రీవాల్
ఇక, బీజేపీ పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ అధికారుల నోటీసులు తమ స్పూర్తిని దెబ్బ తీయలేవని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి దాడులకు తమ పార్టీ భయపడదు.. న్యాయం కోసం తాము పోరాటం చేస్తునే ఉంటామన్నారు. ఎలక్టోరల్ బాండ్ స్కామ్‌ను వేర్వేరు రూట్లలో చేశారు.. ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్, పోస్టు రెయిడ్, షెల్ కంపెనీ గ్రూపుల ద్వారా ఈ బాండ్ల కుంభకోణం జరిగిందన్నారు. పన్ను ఉగ్రవాదంతో కాంగ్రెస్‌పై అటాక్ చేస్తున్నారని జైరాం రామేశ్ ఆరోపించారు.