Navneet Rana: అమిత్ షాను కలిసిన నవనీత్ కౌర్ దంపతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను నవనీత్ కౌర్ దంపతులు కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అమిత్ షాతో చర్చించారు. ఇటీవలే నవనీత్ కౌర్‌కు మహారాష్ట్రలోని అమరావతి నుంచి బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా నవనీత్ కౌర్ పేరును ప్రకటించింది. గతంలో 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. అనంతరం బీజేపీకి దగ్గరయ్యారు. తాజాగా అదే సీటు బీజేపీ నుంచి లభించింది. దీంతో బీజేపీ ముఖ్య నేతలను కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. గురువారం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవిస్‌ను కూడా ఈ దంపతులు కలిశారు.

Also Read
అమిత్ షాతో భేటీ అనంతరం నవనీత్ కౌర్ మీడియాతో మాట్లాడారు. బీజేపీతో తాను కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు. అందుకోసమే అమిత్ షా ఆశీర్వాదం కోసమే ఢిల్లీ వచ్చినట్లు వెల్లడించారు. అమరావతి ప్రజల తరపున హోంమంత్రికి కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పుకొచ్చారు. ఇక ప్రధాని మోడీ పిలుపు ఇచ్చినట్లుగా 400 సీట్లలో అమరావతి కూడా ఒకటిగా ఉంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మోడీ కలను తాను నెరవేరుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Steve Smith: ప్రపంచంలో అతనే బెస్ట్ ప్లేయర్.. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ కీలక వ్యాఖ్యలు
దేశ వ్యాప్తంగా రెండు నెలల పాటు సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం కానుంది. చివరి విడత జూన్ 1న జరగనుంది. ఇక ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఇక ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. విజయమే లక్ష్యంగా అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Vasooli Titans: ప్రధాని మోడీపై మహిళా క్రికెటర్ ‘వసూలీ టైటాన్స్’ పోస్ట్.. వైరల్ కావడంతో డిలీట్..
#WATCH | Lok Sabha MP and BJP candidate from Amravati, Navneet Rana says, "I am starting a new innings in life and I was here to seek his (HM Amit Shah's) blessings. I conveyed to him on behalf of the people of Amravati that Amravati will definitely be one in PM Modi's dream of… pic.twitter.com/KqwMz1BICe
— ANI (@ANI) March 29, 2024
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!