లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎనిమిదో జాబితాను బీజేపీ ప్రకటించింది. 11 మంది అభ్యర్థులతో కూడిన లిస్టును కమలం పార్టీ వెల్లడించింది. ఒడిశా, పంజాబ్, పశ్చిమ బెంగాల్ నుంచి లోక్‌సభ అభ్యర్థుల 8వ జాబితాను బీజేపీ విడుదల చేసింది. గురుదాస్‌పూర్ నుంచి దినేష్ సింగ్ (బబ్బు), అమృత్‌సర్ నుంచి తరంజిత్ సింగ్ సంధు, జలంధర్ నుంచి సుశీల్ కుమార్ రింకూ, ఫరీద్‌కోట్ నుంచి హన్స్ రాజ్ హన్స్, పాటియాలా నుంచి ప్రణీత్ కౌర్ పోటీ చేయనున్నారు.
వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ లక్ష్యంగా బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తోంది. తొలి జాబితాలో 195 మంది అభ్యర్థులను ప్రకటించారు. సెకండ్ జాబితాలో 72 మందిని వెల్లడించారు. మూడో జాబితాలో 111 మందిని.. ఇలా ఎనిమిది జాబితాల్లో బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో కోసం 27 మందితో కూడిన సభ్యులను జేపీ నడ్డా వెల్లడించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు.
వికసిత భారత్ కోసం ఎన్డీఏ కూటమికి 400 కు పైగా సీట్లను కట్టబెట్టాలని ప్రధాని మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. మరోవైపు ఇండియా కూటమి కూడా ధీటుగా అభ్యర్థులను ప్రకటిస్తున్నారు.

