వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్స్ అందుబాటులోకి వచ్చాక రైల్వే ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించింది. ఆధునిక సౌకర్యాలు, వేగం రైలు ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచాయి. ఇప్పటివరకు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ చైర్ కార్ సీటింగ్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు, స్లీపర్ వెర్షన్ సిద్ధంగా ఉంది. రైలు ట్రయల్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. సవాయి మాధోపూర్-కోటా-నాగ్డా విభాగంలో ట్రయల్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ లో స్లీపర్ ట్రైన్ అద్భుతం చేసింది. గంటకు…
Raebareli: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పట్టాలు తప్పించేందుకు కుట్రలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన రాయ్‌బరేలీ జిల్లాలో జరిగింది. ఖీరూన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రఘురాజ్ సింగ్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై ఇసుక కుప్పను చూసిన ప్యాసింజర్ రైలు లోకో పైలట్ వెంటనే నిలిపివేశాడు.
Iron Rods In Rail Track: పంజాబ్‌లోని భటిండాలో ఈరోజు (సోమవారం) పెను ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్‌పై ఇనుప రాడ్‌లు కనిపించడంతో గూడ్స్ రైలు యొక్క లోకో పైలట్ సకాలంలో బ్రేకులు వేయడంతో తృటిలో ప్రమాదం తప్పింది.
Suicide Attempt: బీహార్ లోని మోతీహరిలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తాను చనిపోవాలని రైల్వే ట్రాక్పై పడుకున్న బాలిక గాఢనిద్రలోకి జారుకుని అక్కడే పడుకుండి పోయింది. మరోవైపు అదే ట్రాక్ మీదుగా వెళ్తున్న రైలును లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి ఎలాగోలా ఆపేశాడు. అదృష్టవశాత్తూ ఎలాగోలా బాలిక ప్రాణానికి ఎటువంటి ఆటంకం కలగలేదు. ఈ ఘటన మోతీహరి లోని చకియా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. ఓ బాలిక ఆత్మహత్య చేసుకోవాలనే…
Viral : ఆవు రైల్వే ట్రాక్ దాటుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో ఆవు ట్రాక్‌ను దాటాలని చూస్తుంది, అయితే అదే సమయంలో రైలు వస్తుంది.
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఇంట్లో బెడ్ పై పడుకున్నట్లు.. రైలు పట్టాలపై గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అది కూడా.. కింద టవల్, పైన గొడుగు పెట్టుకుని హాయిగా నిద్రపోతున్నాడు. ట్రాక్‌పై నిద్రిస్తున్న లోకో పైలట్ సకాలంలో చూసి బ్రేకులు వేసి అతని ప్రాణాలు కాపాడాడు. కాగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లోని లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ ను రైల్వే అధికారులు సస్పెండ్ చేశారు. వేగ పరిమితిని ఉల్లంఘించి వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసారు. ఆగ్రా రైల్వే డివిజన్‌లోని మధుర రైల్వే డివిజన్‌కు చెందిన లోకో పైలట్ గంటకు 20 కి.మీ వేగంతో రైలును నడపాలన్న ఆర్డర్‌ను మరచిపోయాడు.
Viral Video : తాజాగా ఓ మహిళ పైలెట్ కు ఊహించని సంఘటన ఎదురయింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెదర్లాండ్ దేశానికి చెందిన ఓ మహిళ పైలెట్ గాల్లో విమానం నడుపుతున్న సమయంలోనే విమానం పైకప్పు ఉన్నట్లుండి తెరుచుకుంది. దాంతో ఆవిడ బయనకరమైన అనుభవాన్ని చవి చూసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు…
రైల్వే ట్రాక్పై పడుకున్న సింహాలను చూసి లోక్ పైలట్ అప్రమత్తతో ట్రైన్ ఆపి వాటి ప్రాణాలను కాపాడాడు. దాదాపు 10 సింహాలు ట్రాక్ పై నిద్రిస్తుండగా.. అది చూసిన లోకో పైలట్ సడన్ గా బ్రేకులు వేశాడు. దీంతో వాటి ప్రాణాలను రక్షించాడు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున గుజరాత్‌లోని పిపావావ్ పోర్ట్ సమీపంలో జరిగింది. లోకో పైలట్ ముఖేష్ కుమార్ మీనా గూడ్స్ రైలును పిపావావ్ పోర్ట్ స్టేషన్ నుండి ప్రధాన కారిడార్ పక్కన ఒక…
పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్పైగురిలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీకొట్టిన ఘటనలో ఇప్పటివరకు 8 మృతి చెందారు. అందులో ముగ్గురు రైల్వే సిబ్బంది ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో ఐదుగురు ప్రయాణికులు, ముగ్గురు రైల్వే సిబ్బంది ఉన్నారు. గూడ్స్ రేక్‌లోని లోకోమోటివ్ పైలట్, అసిస్టెంట్ లోకోమోటివ్ పైలట్, ఎక్స్ప్రెస్ రైలులోని గార్డు మరణించారు.