వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్స్ అందుబాటులోకి వచ్చాక రైల్వే ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించింది. ఆధునిక సౌకర్యాలు, వేగం రైలు ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచాయి. ఇప్పటివరకు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ చైర్ కార్ సీటింగ్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు, స్లీపర్ వెర్షన్ సిద్ధంగా ఉంది. రైలు ట్రయల్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. సవాయి మాధోపూర్-కోటా-నాగ్డా విభాగంలో ట్రయల్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ లో స్లీపర్ ట్రైన్ అద్భుతం చేసింది. గంటకు 180 కి.మీల వేగంతో దూసుకెళ్లింది. అయినప్పటికీ గ్లాసుల్లోని నీరు చుక్క కూడా కింద పడలేదు.
వందే భారత్ స్లీపర్ రైలును పట్టాలపై పరీక్షిస్తున్నప్పుడు, లోకో పైలట్ క్యాబిన్‌లోని ఒక ఉద్యోగి ఈ సంఘటనను వీడియో తీశారు. క్యాబిన్‌లోని స్పీడోమీటర్ ముందు మూడు గ్లాసుల నీరు ఉంచారు. అయితే, రైలు గంటకు 180 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు కూడా, ఒక్క చుక్క నీరు కూడా గ్లాసుల్లోంచి కిందపడలేదు. ఉద్యోగి స్పీడోమీటర్‌పై రైలు వేగాన్ని కూడా రికార్డ్ చేశాడు. స్పీడోమీటర్ 0-200 వేగ పరిధిని సూచిస్తుంది. వీడియో రికార్డింగ్ సమయంలో, స్పీడోమీటర్ 180 వద్దకు చేరుకుంది. ఈ వేగంతో కూడా, రైలు లోపల ఉన్న మూడు గ్లాసుల నీరు చాలా స్థిరంగా ఉన్నట్లు కనిపించింది. సుమారు 27 సెకన్ల ఈ ఫుటేజ్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
🚨Vande Bharat Sleeper Train successfully achieved a top speed of 180 km/h during its trial run on the Sawai Madhopur–Kota–Nagda section. pic.twitter.com/pHrmxo5FtC
— Indian Infra Report (@Indianinfoguide) November 5, 2025