Viral Video : తాజాగా ఓ మహిళ పైలెట్ కు ఊహించని సంఘటన ఎదురయింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెదర్లాండ్ దేశానికి చెందిన ఓ మహిళ పైలెట్ గాల్లో విమానం నడుపుతున్న సమయంలోనే విమానం పైకప్పు ఉన్నట్లుండి తెరుచుకుంది. దాంతో ఆవిడ బయనకరమైన అనుభవాన్ని చవి చూసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Gold Rates Today: మగువలకు ‘గోల్డెన్’ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు!
నెదర్లాండ్ దేశానికి చెందిన నరైన్ మెల్కుమ్జాన్ అనే మహిళ పైలెట్ చిన్న విమానాన్ని టేక్ ఆఫ్ చేసింది. గాల్లోకి వెళ్లిన విమానం కొద్దిసేపు వరకు అంత బాగానే ఉంది. విమానం రైడ్ చేస్తున్న సమయంలో ఆవిడ తన రైడును వీడియోలో రికార్డు చేస్తుంది. అలా రైడ్ చేస్తున్న సమయంలో ఆమె విమానాన్ని చెక్కర్లు కొట్టడం ప్రారంభించింది. అలా కొద్దిసేపు గడిచిన తర్వాత ఒక్కసారిగా విమానం పైకప్పు తెరుచుకుంది. దాంతో ఆవిడ తెగ కంగారు పడిపోయింది. అంత ఎత్తులో వేగంగా వీస్తున్న గాలుల దెబ్బకి ఆవిడ ఉక్కిరిబిక్కిరి అయింది. అయితే అదృష్టం కొద్దీ ప్రయాణించి చివరికి సేఫ్ గానే ల్యాండ్ అయింది. ఇక ఈ ఘటన తర్వాత ఆవిడ ఎక్స్ లో ఓ ట్వీట్ చేసింది.
Las Vegas shooting: అమెరికాలో కాల్పులు.. లాస్ వెగాస్‌లో ఐదుగురు మృతి..
ఇది విన్యాసాల శిక్షణలో భాగంగా తనకి రెండు ప్రయాణమంటూ తెలుపుతూ.. నేను ఎక్స్ట్రా 330 ఎల్ ఎక్స్ విమానంలో ప్రయాణం చేస్తుండగా గాల్లో ఉండగానే పైకప్పు తెరుచుకుంది అంటూ తెలిపింది. అయితే ఈ పొరపాటు టేకాఫ్ కు ముందు సరిగా తాను జాగ్రత్త తీసుకోకపోవడం వల్లే పరిస్థితి ఎదురైందంటూ ఆవిడా తెలిపింది. నేను సరైన తనిఖీ చేసి ఉంటే అంత బాగానే ఉండేటట్టు చెప్పుకొచ్చింది. అలా డోర్ ఓపెన్ అయిన తర్వాత తనకి భారీ శబ్దం, వేగమైన గాలులు, ఎటు సరిగ్గా చూడలేక, శ్వాస తీసుకోలేక తన ఇబ్బంది పడినట్లు ఆవిడ తెలిపింది. ఆ సమయంలో తాను విమానాన్ని నడిపించడం పెద్ద సవాలుగా మారినట్టు చెప్పుకొచ్చింది. అంత ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆవిడ కిందికి వచ్చాక దాదాపు 28 గంటలపాటు కళ్ళను సరిగా చూడలేకపోయింది. ఈ సంఘటన తన జీవితంలో అత్యంత భయంకరమైన పరిస్థితి అంటూ పేర్కొంది.
*PLEASE MIND WHEN WATCHING. AT 2:17 MINUTE MARK VIDEO FOOTAGE BECOMES RATHER INTENSE*
A couple of years ago during my second aerobatic training flight of that day, on a very hot summer day, the canopy of the Extra 330LX that I was flying opened in flight and shattered. As you… pic.twitter.com/nLhvDqVnII
— Narine Melkumjan (@NarineMelkumjan) June 22, 2024