Viral Video: ఇంట్లో బెడ్ అనుకున్నావా నాయనా.. రైలు పట్టాలపై ఎలా నిద్రపోతున్నాడో చూడండి
- యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన
- రైలు పట్టాలపై గాఢ నిద్రలోకి జారుకున్న ఓ వ్యక్తి
- కింద టవల్.. పైన గొడుగు పెట్టుకుని హాయిగా నిద్రపోతున్న వ్యక్తి
- అతన్ని చూసి సకాలంలో స్పందించిన లోకో పైలట్
- బ్రేకులు వేసి అతని ప్రాణాలు కాపాడిన లోకో పైలట్
- వీడియో సోషల్ మీడియాలో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఇంట్లో బెడ్ పై పడుకున్నట్లు.. రైలు పట్టాలపై గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అది కూడా.. కింద టవల్, పైన గొడుగు పెట్టుకుని హాయిగా నిద్రపోతున్నాడు. ట్రాక్‌పై నిద్రిస్తున్న లోకో పైలట్ సకాలంలో చూసి బ్రేకులు వేసి అతని ప్రాణాలు కాపాడాడు. కాగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Kiccha Sudeep: అయ్యబాబోయ్.. హీరో సుదీప్‌కు ఇంత పెద్ద కూతురా..? హీరోయిన్ లు కూడా పనికి రారుగా..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఈ వీడియోలో.. ఓ వ్యక్తి రైలు పట్టాలపై గాడనిద్రలో ఉన్నట్లు కనిపిస్తోంది. కింద టవల్, పైన ఎండ కొట్టకుండా గొడుగు పెట్టుకుని దర్జాగా పడుకున్నాడు. పట్టాలపై అతన్ని చూసిన లోకో పైలట్ అతనిని నిద్ర లేపాడు. అనంతరం.. ట్రాక్ నుండి అతనిని తప్పించడంతో.. రైలు ముందుకి కదిలింది. మీడియా నివేదికల ప్రకారం.. ఈ వైరల్ వీడియో ప్రయాగ్‌రాజ్‌లోని మౌయిమా రైల్వే క్రాసింగ్ దగ్గర జరిగినట్లు తేలింది. గురువారం మధ్యాహ్నం ప్రయాగ్‌రాజ్ నుంచి మౌయిమా మీదుగా ప్రతాప్‌గఢ్ వైపు రైలు వెళ్తోంది. ఇంతలో రైలు రైల్వే క్రాసింగ్ దగ్గర నుంచి ఫ్లైఓవర్ వద్దకు రాగానే లోకో పైలట్ ట్రాక్‌పై ఓ వ్యక్తి పడి ఉండడం చూశాడు. దీంతో.. అలర్ట్ అయి సకాలంలో రైలును ఆపి అతని వద్దకు చేరుకున్నాడు.
Unified Pension Scheme: యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో కీలక అంశాలివే..
పని చేసి అలసిపోయిన ఓ వ్యక్తి రైల్వే ట్రాక్‌పై టవల్, గొడుగు పెట్టుకుని నిద్రిస్తున్నాడు. డ్రైవర్ అతడిని నిద్రలేపి ట్రాక్‌పై నుంచి పక్కకు తీసుకెళ్లాడు. తర్వాత రైలు అక్కడి నుంచి కదిలింది. ఈ ఘటనపై స్పందించిన మౌయిమా రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ తనకు ఈ విషయం తెలియదని అన్నారు. కాగా.. రైల్వే ట్రాక్‌పై నిద్రిస్తున్న వ్యక్తి ఎవరనేది తెలియలేదు. కాగా.. సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా.. కామెంట్స్ కూడా చేస్తున్నారు.
किसी को भी कहीं भी और कभी भी नींद आ सकती है। ऐसा ही कुछ यूपी में देखने को मिला। एक शख्स छतरी लेकर रेलवे ट्रैक पर सो गया। लोको पायलट ने जब उसे देखा तो ब्रेक लगाकर ट्रेन रोकी और उसे पटरी से हटाया। मीडिया रिपोर्ट्स के मुताबिक ये मामला प्रयागराज का है। #Train #Prayagraj #viralvideo pic.twitter.com/ZVV5939Nq9
— Pawan Kumar Sharma (@pawanks1997) August 25, 2024
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..