హిజ్బుల్లా, ఇరాన్‌తో విభేదాల మధ్య అరబ్ దేశాలు ఇప్పుడు ఇజ్రాయెల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలాయి. టెహ్రాన్, ఇజ్రాయెల్ మధ్య వివాదంలో తాము తటస్థంగా ఉంటామని ఇరాన్‌కు భరోసా ఇవ్వడానికి అరబ్ దేశాలు ఈ వారం దోహాలో సమావేశమయ్యాయి. ఈ ప్రాంతంలో వివాదాలు పెరగడం వల్ల తమ చమురు కేంద్రాలకు ముప్పు వాటిల్లుతుందని అరబ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
Israel: ఇజ్రాయిల్ హిజ్బుల్లాను పూర్తిగా తుడిచివేయాలని కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. లెబనాన్ దాని రాజధాని బీరూట్‌పై భీకర దాడులు చేస్తోంది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాని గత వారం బీరూట్‌లో వైమానిక దాడి చేసి హతం చేసింది.
హిజ్బుల్లా చీఫ్ ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హత్యకు గురైన తర్వాత ఇరాక్‌లో 100 మందికి పైగా నవజాత శిశువులకు 'నస్రల్లా' అని పేరు పెట్టారు. నస్రల్లా మరణం మధ్యప్రాచ్యంలో ప్రకంపనలు సృష్టించగా, మరోవైపు ఆయన పేరుకు ప్రజాదరణ వేగంగా పెరిగింది. నస్రల్లా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పోరాటం, ప్రతిఘటనకు చిహ్నంగా పరిగణించబడ్డాడు. ఇప్పుడు ఆయన మరణానంతరం ఆయన పేరు కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
సరిహద్దు ప్రాంతాల్లోని లెబనాన్ పౌరులు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేసింది ఇజ్రాయెల్ ఆర్మీ. దీనికి సంబంధించిన ప్రకటనను ఆ దేశ సైన్యం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది.
Indian Army Chief: లెబనాన్‌లో హెజ్‌బొల్లా శ్రేణులే టార్గెట్ గా ఇజ్రాయెల్ జరిపిన ‘పేజర్ బ్లాస్ట్ ఆపరేషన్’తో ప్రపంచ షాక్ అయిందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు.
Mehbooba Mufti: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అడాల్ఫ్ హిట్లర్ తర్వాత నెతన్యాహునే అతి పెద్ద ఉగ్రవాది అని అభివర్ణించింది.
Lebanon – Israel: మధ్యప్రాచ్య దేశమైన లెబనాన్‌పై ఇజ్రాయెల్ ఆదివారం నాడు వరుస బాంబు దాడులను కొనసాగించింది. ఈ దాడిలో హిజ్బుల్లా గ్రూపుకు చెందిన 100 మందికి పైగా మరణించినట్లు సమాచారం. లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రధాన దక్షిణ నగరం సిడాన్ సమీపంలో జరిగిన ఘోరమైన వైమానిక దాడిలో 107 మంది మరణించారు. ఘటనలో ఏకంగా 359 మంది గాయపడ్డారు. తూర్పు, దక్షిణ, బీరుట్ పరిసర ప్రాంతాలలో ఎక్కువ మరణాలు సంభవించాయి. ఇందులో ఓ…
హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా మరణం తర్వాత, ఇజ్రాయెల్ ఇప్పుడు లెబనాన్ రాజధాని బీరూట్‌లోని నివాస ప్రాంతాలపై కూడా దాడి చేస్తోంది. తొలిసారిగా బీరుట్‌లోని నివాస భవనాలపై ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు సమాచారం. బీరుట్ శివారు ప్రాంతాలే కాకుండా, ఆదివారం సాయంత్రం నుంచి బీరుట్‌లో కూడా ఇజ్రాయెలీ డ్రోన్‌లు కనిపించాయి.
Iran: ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణించడంతో గట్టి షాక్ తగిలింది. దీంతో హెజ్‌బొల్లా మరింత తీవ్రంగా ఇజ్రాయెల్‌పై విరుచుకుపడే అవకాశం ఉంది. ఈ సమయంలో ఇరాన్ భద్రతా మండలి అత్యవసర భేటీకి పిలుపునిచ్చింది. హెజ్ బొల్లాకు మద్దతిస్తున్నట్లు ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది.
Israel-Hezbollah: లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ కనీవినీ ఎరుగని స్థాయిలో బాంబుల వర్షం కురిపించింది. హెజ్‌బొల్లా అధిపతి హసన్ నస్రల్లా లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తుంది.