Israel Hezbullah Conflict : లెబనాన్ ఈశాన్య ప్రాంతంలో ఇజ్రాయెల్ బాంబు దాడిలో మరణించిన వారి సంఖ్య 45 కి పెరిగింది. గతంలో హిజ్బుల్లాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల నుండి తప్పించుకున్న గ్రామీణ గ్రామాలపై కూడా వైమానిక దాడులు నిర్వహించింది.
Israel: హెజ్‌బొల్లాకు మరో భారీ షాక్ తగిలింది. ఆ గ్రూప్ చీఫ్ హసన్ నస్రల్లా హత్య తర్వాత అతని బంధువు హషీమ్ సఫీద్దీన్‌ను వారసుడిగా అందరు భావిస్తున్నారు.
Israel - Hezbollah: ఇజ్రాయెల్ మధ్య ప్రాంతంపై హెజ్‌బొల్లా మంగళవారం రాకెట్లతో దాడికి దిగింది. ఇక, వాటిని ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకుంది. ఒక రాకెట్ నిర్మానుష్య ప్రాంతంలో పడగా.. ఒక రిజర్విస్టు సైనికుడు మరణించినట్లు వెల్లడించారు.
హెజ్‌బొల్లా డిప్యూటీ చీఫ్ గా ఉన్న నయీమ్ ఖాసిమ్ ప్రాణ భయంతో లెబనాన్‌ను వదిలి పెట్టినట్లు సమాచారం. డిప్యూటీ చీఫ్ ఖాసిమ్ ఇరాన్‌కు పారిపోయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించింది.
Israel strikes: లెబనాన్‌లోని బీరుట్‌లో ఉన్న హెజ్‌బొల్లా సంస్థ ఆర్థిక మూలాలను దెబ్బ తీయటమే టార్గెట్ గా ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తుంది. హెజ్‌బొల్లాకు నిధులు సమకూర్చుతున్నారనే ఆరోపణలు ఉన్న గ్రూప్‌లకు ఇజ్రయెల్ వార్నింగ్ ఇచ్చింది.
Drone Targets Israel PM: ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు లక్ష్యంగా లెబనాన్ నుంచి ప్రయోగించిన డ్రోన్ ఈరోజు (శనివారం) దక్షిణ హైఫాలోని సిజేరియాలోని నెతన్యాహు ప్రైవేట్ నివాసం సమీపంలో పేలిపోయిందని రాయిటర్స్ నివేదించింది. గాజాలో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను ఇజ్రాయెల్ చంపేసిన రెండు రోజుల తర్వాత ఈ దాడి జరిగడంతో తీవ్ర కలకలం రేపుతుంది.
Italy PM On Lebanon: హిజ్బుల్లా-ఇజ్రాయెల్ వివాదంలో చిక్కుకున్న లెబనీస్ ప్రజలకు మద్దతు అందించడానికి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ లెబనాన్‌లో పర్యటించారు.
ఉత్తర ఇజ్రాయెల్‌పై లెబనాన్ 15 రాకెట్లు ప్రయోగించిందని ఐడీఎఫ్ వెల్లడించింది. కొన్ని రాకెట్లను అడ్డగించగా.. మరికొన్ని ఇజ్రాయెల్ భూభాగంలో పడ్డాయని తెలిపింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేసింది. అలాగే ఆస్తి నష్టాలు కూడా పెద్దగా జరగలేదని పేర్కొంది. ఐడీఎఫ్ డ్రోన్ రాకెట్ లాంచర్‌లను కూల్చివేసేసింది
Israel Hezbollah: హమాస్ గ్రూప్ చీఫ్ యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ ఐడీఎఫ్ మట్టుపెట్టడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా తమ పోరాటం తీవ్రతరం చేస్తున్నట్లు హెజ్‌బొల్లా గ్రూప్ వెల్లడించింది.
Benjamin Netanyahu: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో ఇరాన్ జరిపిన దాడులకు ప్రతీకారంగా అణు, చమురు స్థావరాలపై దాడి చేయబోమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు.