ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు లెబనాన్‌లోకి ప్రవేశించి దాడి చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో.. ఉత్తర సరిహద్దులో యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలు మోహరించాయి. దీంతో.. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌పై దాడి చేయబోతున్నట్లు భావిస్తున్నారు.
Israel Attacks On Lebanon: లెబనాన్‌లో ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇటీవల వైమానిక దాడులు, కమ్యూనికేషన్ పరికరాల్లో పేలుళ్ల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో భారతప్రజల ఆందోళన కూడా పెరిగింది. ఈ సంఘటనల తరువాత, బీరూట్ లోని భారత రాయబార కార్యాలయం తదుపరి నోటీసు వచ్చే వరకు లెబనాన్‌కు వెళ్లకుండా సలహాలను జారీ చేసింది. అంతేకాదు, ఎవరైనా భారత పౌరులు ఉంటే వెంటనే లెబనాన్ వదిలి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.…
Indian Army: మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయెల్ – హిజ్బుల్లా మధ్య ఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో, UN శాంతి పరిరక్షక దళంలో భాగంగా ఇజ్రాయెల్ – లెబనాన్ దేశాల సరిహద్దులో మోహరించిన భారత సైన్యం అక్కడి పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. లెబనాన్‌లో ఇటీవల జరిగిన పేజర్ పేలుడు హిజ్బుల్లా, ఇజ్రాయెల్ లను యుద్ధం అంచున ఉంచింది. కాగా, శాంతిభద్రతల పరిరక్షణలో భారత సైన్యం కీలక పాత్ర పోషిస్తోంది. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్ కింద భారత సైన్యం సమస్యాత్మక…
హిజ్బుల్లా లక్ష్యంగా సోమవారం లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 28 చిన్నారుల సహా 558 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయాలు పాలయ్యారు.
లెబనాన్‌పై సోమవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరణించిన వారి సంఖ్య మరింత పెరుగుతోంది. సోమవారం 300 మంది చనిపోయినట్లు లెబనాన్ ప్రకటించగా.. ఆ సంఖ్య ప్రస్తుతం 500 మందికి చేరింది. వందలాది మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ గురి చూసి లక్ష్యాలను చేధించినట్లు సమాచారం.
Israel Air Strike : లెబనాన్ రాజధాని బీరుట్ శివారులో శుక్రవారం జరిగిన వైమానిక దాడిలో మృతుల సంఖ్య 37కి పెరిగింది. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించిన వారిలో చాలా మంది మహిళలు, పిల్లలు ఉన్నారు.
లెబనాన్‌లో పేజర్ పేలుడు ఘటన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సంఘటనకు సంబంధించి ముఖ్యమైన వ్యక్తిగా 49 ఏళ్ల విదేశీ మహిళ పేరు వినిపిస్తోంది. ఈ మహిళ హంగేరీకి చెందినది. ఆమె పేరు క్రిస్టియానా బార్సోనీ. క్రిస్టియానా బుడాపెస్ట్‌లోని BAC కన్సల్టింగ్‌కు CEOగా వ్యవహరిస్తోంది.
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈసారి లెబనాన్‌లోని హిజ్బుల్లా-ఇజ్రాయెల్ మధ్య వార్ సీరియస్‌గా మారింది. నిన్నామొన్నటిదాకా హమాస్ లక్ష్యంగా గాజాను ఇజ్రాయెల్ మట్టుబెట్టింHamas
Lebanon : లెబనాన్‌లో మంగళవారం దేశవ్యాప్తంగా వేలాది పేజర్లు ఏకకాలంలో పేలడంతో వేలాది మంది గాయపడ్డారు. సాయుధ సమూహం హిజ్బుల్లా కమ్యూనికేషన్ కోసం ఉపయోగించిన ఈ పేజర్లు ఊహించని విధంగా పేలడంతో తొమ్మిది మందికి పైగా మరణించారు.
లెబనాన్‌లో తాజాగా వాకీటాకీలు పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. 300 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఆయా ప్రాంతాలు రక్తంతో తడిచిపోయాయి.