Iran: హెజ్‌బొల్లా చీఫ్ హత్య.. ఇరాన్ భద్రతా మండలి అత్యవసర భేటీ..
- హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతిలో షాక్ లో ఇరాన్..
- అత్యవసర భద్రతా మండలి సమావేశానికి పిలుపునిచ్చిన ఇరాన్..
- ఇజ్రాయెల్‌పై దాడుల గురించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణించడంతో గట్టి షాక్ తగిలింది. దీంతో హెజ్‌బొల్లా మరింత తీవ్రంగా ఇజ్రాయెల్‌పై విరుచుకుపడే అవకాశం ఉంది. ఈ సమయంలో ఇరాన్ భద్రతా మండలి అత్యవసర భేటీకి పిలుపునిచ్చింది. హెజ్ బొల్లాకు మద్దతిస్తున్నట్లు ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. దీనిపై భద్రతా మండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. అయితే ఇజ్రాయెల్‌పై యెమెన్, లెబనాన్, సిరియా తీవ్రంగా విరుచుకుపడే ఛాన్స్ ఉంది. ఈ దాడులకు ఇరాన్ సపోర్టుగా నిలుస్తుందని టాక్.
Read Also: Mallu Bhatti Vikramarka: లేక్స్ లేకపోతే విజయవాడ పరిస్థితే హైదరాబాద్ కు..
Also Read
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
- Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
- Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
కాగా, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మాట్లాడుతూ.. లెబనాన్ ప్రజలకు, హెజ్‌బొల్లాకు మద్దతుగా ఉండటంతో పాటు ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కోవడంలో వారికి సహాయం చేయాలని అంతర్జాతీయ సమాజానికి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గాజాలో ఏడాదిగా కొనసాగుతున్న యుద్ధం నుంచి ఇజ్రాయెల్ ఏం నేర్చుకోలేదన్నారు. మహిళలు, పిల్లలు, పౌరుల సామూహిక హత్యలు ఆ ప్రతిఘటన శక్తుల్ని విచ్ఛిన్నం చేయలేవన్నారు. నస్రల్లా హత్య తర్వాత ఖమేనీని ఇరాన్‌లోని సురక్షిత ప్రదేశానికి అక్కడి ఆర్మీ తరలించింది. నస్రల్లా హత్యను ఖండిస్తూ.. ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకోవాలని కోరుతూ టెహ్రాన్‌లో వేలాది మంది ఇరానియన్లు వీధుల్లోకి వచ్చి ఆందోళన తెలిపారు.
Read Also: Harish Rao: మూసి ప్రాంతంలో కూల్చాలంటే మా మీద నుంచి వెళ్ళాలి..
అయితే, హసన్ నస్రల్లా హత్యను ఇజ్రాయెల్ ధృవీకరించిన తర్వాత సిరియాలో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. సిరియా విప్లవాన్ని అణచివేసేందుకు అప్పటి హెజ్‌బొల్లా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్‌కు మిలిటెంట్ గ్రూప్ సహాయం చేసినందున అక్కడి ప్రజలు వారిని శత్రువులుగా భావిస్తారు. అంతర్యుద్ధం టైంలో వేలాది మంది సిరియన్లు హెజ్‌బొల్లా దాడుల్లో తమ ప్రాణాలను కోల్పోయారు. కాగా, శనివారం లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 33 మంది చనిపోగా, మరో 195 మంది తీవ్రంగా గాయపడ్డారని లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పుకొచ్చింది. గత రెండు వారాల్లో ఇజ్రాయెల్ దాడుల్లో 1,000 మందికి పైగా మృతి చెందాగా.. దాదాపు 6,000 మందికి పైగా గాయపడ్డారని చెప్పుకొచ్చారు. అలాగే, వందల సంఖ్యలో ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలిపోయారని వెల్లడించారు.
తాజావార్తలు
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
-
Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
-
KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
-
The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
-
Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?