Israel: మరొక హిజ్బుల్లా కీలక నేతని ఖతం చేసిన ఇజ్రాయిల్..
- హిజ్బుల్లాపై దాడులు తీవ్రం చేసిన ఇజ్రాయిల్..
- హిజ్బుల్లా కమ్యూనికేషన్ చీఫ్ హతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: ఇజ్రాయిల్ హిజ్బుల్లాను పూర్తిగా తుడిచివేయాలని కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. లెబనాన్ దాని రాజధాని బీరూట్‌పై భీకర దాడులు చేస్తోంది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాని గత వారం బీరూట్‌లో వైమానిక దాడి చేసి హతం చేసింది. దీనికి ముందే ఆ సంస్థ ప్రధాన కమాండర్లను ఒక్కొక్కరిగా వేటాడి వెంటాడి చంపేసింది. దీంతో హిజ్బుల్లా మిలిటరీ చైన్‌ని దెబ్బతీసింది. ప్రస్తుతం వైమానిక దాడులో పాటు భూతల దాడులు చేస్తోంది. దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటెంట్ స్థావరాలను ధ్వంసం చేస్తోంది.
Read Also: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 36 మంది మావోయిస్టుల హతం..
Also Read
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
- Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ఇదిలా ఉంటే, తాజాగా హిజ్బుల్లా కీలక నేత, దాని కమ్యూనికేషన్ నెట్‌వర్క్ అధిపతి మహ్మద్ రషీద్ సకాఫీని బీరూట్‌లో గురువారం జరిపిన దాడుల్లో హతం చేసినట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) శుక్రవారం ప్రకటించింది. ఖచ్చితమైన ఇంటెలిన్స్ ఆధారిత దాడి జరిగినట్లు ఐడీఎఫ్ చెప్పింది. సకాఫీ ఒక సీనియర్ హిజ్బుల్లా తీవ్రవాదిగా, ఇతను 2000 నుంచి కమ్యూనికేషన్స్ విభాగానికి చీఫ్‌గా ఉన్నాడు. హిజ్బుల్లాకి చెందిన అన్ని యూనిట్ల మధ్య కమ్యూనికేషన్ సామర్థ్యం పెంచడానికి కీలక ప్రయత్నాలు చేశాడు.
దీనికి ముందు మరొక కీలక హిజ్బుల్లా నేత మహ్మద్ అనిసిని చంపినట్లు ఇజ్రాయిల్ పేర్కొంది. ఇతను గైడెడ్ మిస్సైల్స్ డెవలప్మెంట్‌లో పాల్గొంటున్నట్లు ఇజ్రాయిల్ తెలిపింది. అనిసి 15 ఏళ్ల క్రితం హిజ్బుల్లాలో చేరాడు. ఇదిలా ఉంటే, నస్రల్లా మరణం తర్వాత అతడి వారసుడిగా చెప్పబడుతున్న హషీమ్ సఫీద్దీన్ భూగర్భ బంకర్‌లో సమావేశానికి హాజరవుతున్న సమయంలో ఇజ్రాయిల్ గురువారం అర్థరాత్రి భారీ దాడి చేసిందని ది న్యూయార్క్ టైమ్స్ ఒక కథనంలో తెలిపింది. ఈ దాడి నస్రల్లాని చంపిన దానికన్నా పెద్దదని, మృతుల సంఖ్య ఇంకా తెలియరాలేదని వెల్లడించింది.
🔴Mohammad Rashid Sakafi, the Commander of Hezbollah’s Communications Unit, during a precise, intelligence-based strike in Beirut yesterday.
Sakafi was a senior Hezbollah terrorist, who was responsible for the communications unit since 2000. Sakafi invested significant efforts… pic.twitter.com/PH65nh5FLI
— Israel Defense Forces (@IDF) October 4, 2024
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!