Israel-Hezbollah: లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ కనీవినీ ఎరుగని స్థాయిలో బాంబుల వర్షం కురిపించింది. హెజ్‌బొల్లా అధిపతి హసన్ నస్రల్లా లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తుంది. ఈ దాడిలో ఆయన చనిపోయారా..? లేదా సురక్షితమా? అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. నస్రల్లా సురక్షితంగా ఉన్నారని హెజ్‌బొల్లా వర్గాలు చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ మాత్రం ఇంకా ధ్రువీకరించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నస్రల్లా గురించిన సమాచారాన్ని సేకరిస్తున్నామని ఇరాన్ చెప్పుకొచ్చింది. దక్షిణ లెబనాన్‌లోని దాహియాలోని నివాసగృహాల కింద భూగర్భంలో ఉన్న హెజ్‌బొల్లా ప్రధాన ఆఫీసుపై పెద్ద ఎత్తున బాంబులతో ఇజ్రాయెల్ దాడి చేసింది.
Read Also: Hurricane Helene : ఫ్లోరిడా, జార్జియాలో హెలెన్ హరికేన్ విధ్వంసం.. 30 మంది మృతి
కాగా, దాహియాతో పాటు బీరుట్‌లోని చాలా ప్రాంతాలు ఈ బాంబులతో దద్దరిల్లాయి. భవనాలు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. దాదాపు 8 బిల్డింగులు సమూలంగా ధ్వంసమయ్యాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. దాహియా హెజ్‌బొల్లాకు బాగా పట్టున్న ప్రాంతంలో.. అందుకే గత వారం రోజులుగా ఈ ప్రాంతాన్నే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆర్మీ (ఐడీఎఫ్) పదే పదే దాడులు కొనసాగిస్తుంది. దాదాపు 18 మంది హెజ్‌బొల్లా అగ్రశ్రేణి కమాండర్లను ఐడీఎఫ్ మట్టుబెట్టింది. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 79వ సదస్సులో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రసంగం ముగిసిన కొన్ని నిమిషాలకే ఈ భీకర దాడికి చేసింది. న్యూయార్క్‌లోని తన హోటల్ గది నుంచే ఈ వైమానిక దాడికి నెతన్యాహు ఆదేశాలు జారీ చేశారని సమాచారం.
Smoke can be seen over Dahieh, Beirut as the area was hit again pic.twitter.com/7Fr46zQxpl
— Nafiseh Kohnavard (@nafisehkBBC) September 27, 2024