ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య వార్ మరోసారి ఉధృతం అయింది. ఇజ్రాయెల్ సైన్యమే లక్ష్యంగా హిజ్బుల్లా రెచ్చిపోయింది. ఆదివారం ఒకేసారి 250 రాకెట్లను ప్రయోగించింది. ఇరాన్ మద్దతుతో ఈ రాకెట్లను ప్రయోగించింది. లెబనాన్ సరిహద్దు ప్రాంతం నుంచి ఈ క్షిపణులను ప్రయోగించింది.
ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా విరుచుకుపడింది. టెల్ అవీవ్‌పై హిజ్బుల్లా క్షిపణులను ప్రయోగించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. పలువురు ఇజ్రాయెల్ పౌరులు గాయపడ్డారు.
ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేసినట్లుగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకరించారు. అక్టోబర్ చివరిలో అకస్మా్త్తుగా ఇరాన్ అణు స్థావరాలపై ఐడీఎఫ్ దళాలు దాడి చేశాయి. దీంతో ఒక్కసారిగా ఇరాన్ ఉలిక్కిపడింది.
లెబనాన్ రాజధాని బీరుట్ సమీపంలోని ఓ గ్రామంపై ఇజ్రాయెల్ సైన్యం బాంబు దాడి చేసింది. ఈ దాడిలో 7 మంది చిన్నారులు సహా 23 మంది మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఇజ్రాయెల్, లెబనాన్‌లోని హిజ్బుల్లా మధ్య భారీ బాంబు దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(IDF) లెబనాన్ లోపల హిజ్బుల్లా లక్ష్యాలపై వైమానిక దాడులు చేస్తోంది.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత హిజ్బుల్లా రెచ్చిపోయింది. ట్రంప్ ఎన్నిక తర్వాత దాడులు తగ్గుతాయని అంతా భావించారు. కానీ అందుకు రివర్స్‌గా జరుగుతుంది. లెబనాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా సోమవారం విరుచుకుపడింది. ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి దిగింది.
Israel Attack : ఇజ్రాయెల్ దాడిలో గాజా, లెబనాన్‌లలో మొత్తం 23 మంది మరణించారు. ఇందులో శనివారం గాజాలోని మూడు వేర్వేరు ప్రదేశాలలో ఇజ్రాయెల్ దాడుల్లో మహిళలు, పిల్లలతో సహా దాదాపు 16 మంది మరణించారు.
హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. హమాస్ అగ్ర నాయకులందరినీ అంతమొందించింది. ఇక గాజా పట్టణాన్ని ఐడీఎఫ్ సర్వనాశనం చేసింది. అయితే చాలా దినాలుగా యుద్ధం జరుగుతుండడంతో గాజాలోని సామాన్య ప్రజలు తిండి లేక నానా యాతన పడుతున్నారు.
Israeli Airstrikes Beirut: లెబనాన్ రాజధాని బీరుట్ శివారు ప్రాంతాలపై భారీ స్థాయిలో వైమానిక దాడులకు దిగింది ఇజ్రాయెల్. లెబనాన్‌లోని ఏకైక అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు సమీపంలోనూ దాడులకు పాల్పడింది.
Lebanon Israel War: లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో సుమారు 30 మంది ప్రాణాలు విడిచారు. బర్జా పట్టణంపై మంగళవారం రాత్రి జరిగిన దాడిలో ఓ అపార్టుమెంట్ కూలిపోయింది.