ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్, పిక్సెల్ ఫోన్స్, క్రోమ్ బ్రౌజర్ టీమ్స్ లో పని చేస్తున్న వందలాది మంది ఉద్యోగులకు గూగుల్ కంపెనీ లేఆఫ్‌లు ప్రకటించింది. సంస్థలోని ఓ వ్యక్తి ద్వారా లేఆఫ్స్ విషయం బయటకు వచ్చినట్లు జాతీయ మీడియా తెలిపింది.
Microsoft Layoffs 2025: మరోసారి ఉద్యోగులను తొలగించడానికి టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రెడీ అవుతుంది. ప్రాజెక్ట్ బృందాలలో ఇంజనీర్ల నిష్పత్తిని పెంచే ప్రయత్నంలో భాగంగానే ఈ కోతలు విధిస్తున్నట్లు సమాచారం.
Layoffs 2025: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం టెక్ ప్రపంచంలో "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)" మాటే వినిపిస్తోంది. రానున్న రోజుల్లో ప్రపంచాన్ని శాసించే దిశగా ఏఐ అడుగులు వేస్తోంది. అయితే, ఇప్పుడు ఏఐ అభివృద్ధి ఉద్యోగులకు చేటు చేయబోతోంది. 2025లో ప్రపంచవ్యాప్తంగా టెక్, ఇతర ఇండస్ట్రీల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. 2025లో భారీ సంఖ్యలో టెక్ లేఆఫ్స్ ఉండబోతున్నాయి.
ఫెడరల్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ సిబ్బంది అందరికీ లేఆఫ్‌లు ఇవ్వడానికి ట్రంప్ కార్యవర్గం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వారందరినీ సెలవులో ఉంచాలని జీవో జారీ చేసింది. ఇక, అమెరికా ఫెడరల్ ప్రభుత్వానికి చెందిన డైవర్సిటీ, ఇన్‌క్లూజన్ ప్రోగ్రామ్‌లను నిర్వీర్యం చేయడానికి ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లపై సంతకం పెట్టారు.
Layoffs in Dunzo: రిలయన్స్ రిటైల్ మద్దతుగల డన్జో ఖర్చులను తగ్గించుకోవడానికి దాదాపు 75 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. అందిన నివేదిక ప్రకారం, ఇంత పెద్ద ఎత్తున తొలగింపు కారణంగా కంపెనీలో పనిచేస్తున్న 150 మంది ఉద్యోగులు పైగా తమ ఉద్యోగాలను కోల్పోయారు. Dunzo ఇప్పుడు దాని ప్రధాన సరఫరా, మార్కెట్ ప్లేస్ టీమ్ లలో కేవలం 50 మంది ఉద్యోగులతో పనిచేస్తోంది. సంస్థ తన ఆర్థిక ఇబ్బందవులను తీర్చడానికి నానా తంటాలు పడుతోంది. తొలగింపుల…
Google Layoffs 2024: టెక్ దిగ్గజం ‘గూగుల్’ మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. ఈ విషయాన్ని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరాట్ రాసిన అంతర్గత లేఖలో పేర్కొన్నారు. పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికల్లో భాగంగా ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. 2024లో మరింత మంది ఉద్యోగులను తొలగిస్తామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే. ‘ఏఐ వల్ల టెక్ రంగంలో పెను మార్పులు వస్తున్నాయి. కోట్లాది మంది కస్టమర్లకు…
Layoffs: టెక్ సంస్థల్లో ఉద్యోగాల లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. రెండేళ్లుగా ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో అని టెక్కీలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలైన మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్‌లో పాటు చిన్నాచితకా కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఆర్థికమాంద్యం భయాలు, ఆర్థిక అస్థిరత కారణంగా ఖర్చులను తగ్గించుకోవాలనే ఆలోచనలతో సంస్థలు ఉద్యోగులను తీసేస్తున్నాయి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కారణంగా అనేక కంపెనీలు వారి ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఇందులో భాగంగానే ఇటాలియన్ – అమెరికన్ ఆటోమేకర్ స్టెల్లాంటిస్ కంపెనీ ఒకేఒక్క ఫోన్ కాల్ తో అమెరికాలోని తమ ఇంజినీరింగ్, టెక్నాలజీ భాగాలలోని 400 మంది ఉద్యోగులను ఇంటికి పంపేసింది సదరు సంస్థ. ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన ఫార్చ్యూన్ మేగజైన్ కథనం ప్రకారం.. మర్చి 22న కంపెనీ వారు రిమోట్ కాల్ చేసి ఉద్యోగులకు లేఆఫ్ లు…