Morgan Stanley Layoff: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమన, ఆర్థికమాంద్యం భయాలు టెక్ కంపెనీలతో పాటు అన్ని మల్టీనేషనల్ కంపెనీలను కలవరపరుస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం లేఆఫ్స్ జాబితాలో మరో కంపెనీ చేరేందుకు సిద్ధం అవుతోంది. ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ కూడా తన ఉద్యోగులను తొలగించే ప్లాన్ లో ఉంది.
టెక్ సెక్టార్ ఈ మధ్య కాలంలో అల్లకల్లోలంగా ఉంది. ఐటీ రంగంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు గతంలో పెద్ద ఎత్తున తొలగింపులను ప్రకటించాయి. గూగూల్, మెటా, అమెజాన్ లాంటి సంస్థలు తమ ఉద్యోగుల్లో భారీ కోత విధించాయి.
More Layoffs in Google: టెక్ దిగ్గజాలు లేఆఫ్స్ కొనసాగిస్తూ ఉన్నాయి.. ఆ సంస్థ ఈ సంస్థ అనే తేడా లేకుండా.. ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి.. ఇక, టెక్ దిగ్గజం గూగుల్ కూడా ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది.. 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు జనవరిలో ప్రకటించిన ఆ సంస్థ.. ఇప్పుడు రెండో రౌండ్ లేఆఫ్స్ కు సిద్ధం అవుతుంది.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చేసిన వ్యాఖ్యలు…
డిపాజిటర్లు పెద్ద ఎత్తున నిధులను ఉపసంహరించుకోవడం దివాళా తీసి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ప్రభావం చాలా దేశాలపై పడుతోంది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్‌వీబీ) మూసివేత పట్ల స్టార్టప్ సంస్థలు ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా 8,500 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు తెలిపింది. ఆర్థికపరమైన కారణాల వల్ల ఖర్చును తగ్గించుకునేందు ఉద్యోగాలను తగ్గిస్తున్నట్లు సంస్థ పేర్కొంది.
Google and Twitter: గ్లోబల్ టెక్ కంపెనీలు ఇతర దేశాలతోపాటు ఇండియాలో కూడా ఖర్చులను తగ్గించుకోవటంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాయి. ఇన్నాళ్లూ ఉద్యోగులను రాత్రికిరాత్రే తీసివేయగా ఇప్పుడు ఆఫీసులను సైతం తెల్లారే సరికి మూసివేస్తున్నాయి. తాజాగా గూగుల్ మరియు ట్విట్టర్ సంస్థలు ఈ మేరకు చర్యలు చేపట్టాయి. గూగుల్ కంపెనీ 453 మందికి లేఆఫ్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 12 వందల మంది ఉద్యోగులను తీసేయటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం డిస్నీ బుధవారం 7,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. గత ఏడాది చివరలో కంపెనీకి నాయకత్వం వహించమని తిరిగి అడిగిన తర్వాత సీఈవో బాబ్ ఇగర్ తీసుకున్న మొదటి ప్రధాన నిర్ణయం ఇది.
Today (30-01-23) Business Headlines: ఏపీలో ఒబెరాయ్ హోటల్స్: ఆంధ్రప్రదేశ్‘లోని వివిధ జిల్లాల్లో ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్ నిర్మాణం జరగనుంది. ఈ మేరకు ఆ సంస్థ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ APTDCతో ఒప్పందం కుదుర్చుకుంటోంది. ఇందులో భాగంగా మొదట తిరుపతిలోని అలిపిరిలో 100 కోట్ల రూపాయల ఖర్చుతో సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణం చేపట్టనుంది. దీనికి ఆ రాష్ట్ర ప్రభుత్వం 20 ఎకరాల భూమిని లీజ్ కమ్ రెంట్ ప్రాతిపదికన కేటాయించింది.