Karnataka HC: కర్ణాటకలో ఓ చర్చి ప్రీస్ట్‌గా ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న కేసులో ఆ రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘వెళ్లి ఉరివేసుకో’’ అని వ్యాఖ్యలు చేయడం ఆత్మహత్యను ప్రేరేపించేదిగా చూడలేమని కోర్టు పేర్కొంది. ఈ వ్యాఖ్యలు అన్ని సందర్భాల్లో ఆత్మహత్యకు ప్రేరేపణగా పరిగణించాల్సిన అవసరం లేదని చెప్పింది. జస్టిన్ ఎం నాగప్రసన్న ఈ కేసును విచారించారు. ఉడిపిలో చర్చి ప్రీస్ట్ మరణానికి సంబంధించి ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలే కారణమయ్యాయనే పిటిషన్‌పై కోర్టు తీర్పు ఇచ్చింది.
Read Also: PM Modi: ‘‘ఓట్ జిహాద్’’ వ్యాఖ్యలు ఇండియా కూటమి ప్లాన్‌ని బయటపెట్టాయి.
తన భార్యతో చర్చ్ ప్రీస్ట్‌కి అక్రమ సంబంధం ఉందని ఆరోపించిన భర్త, సదరు పూజారిపై ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు ప్రీస్ట్ ఆత్మహత్యకు కారణమయ్యాయని మహిళ భర్తపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును వాదనల సందర్భంలో.. నిందితుడి మాటలతో కాకుండా ఇతరులకు ఈ విషయం తెలిసిందనే కారణంమే ప్రీస్ట్ ఆత్మహత్యకు కారణమైందని డిఫెన్స్ న్యాయవాది వాదించారు. మరోవైపు ఈ వ్యహహారాన్ని బయటపెడతానని నిందితుడు బెదిరించడం వల్లే ప్రీస్ట్ ఆత్మహత్య చేసుకున్నాడని ప్రత్యర్థి న్యాయవాది వాదించారు.
కేవలం ఇలాంటి వ్యాఖ్యలు మాత్రమే ఆత్మహత్యకు ప్రేరేపించవని, ప్రీస్ట్ ఆత్మహత్య వెనక చాలా కారణాలు ఉన్నాయని కోర్టు అంగీకరించింది. తండ్రిగా, ప్రీస్ట్‌గా ఉన్న అతను అక్రమ సంబంధంతో సహా మానవ మనస్తత్వ శాస్త్రంలోని సంక్లిష్టతను గుర్తించిన న్యాయస్థానం, మానవ మనసును అర్థం చేసుకునే సవాలును నొక్కి చెప్పింది. నిందితుడి వ్యాఖ్యలు ఆత్మహత్యకు ప్రేరించాయనే వాదనల్ని కోర్టు నిరాకరించింది.