రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. భారతదేశం సాధించిన విజయాలు, మన నుంచి ప్రపంచం ఆశించేవి, సామాన్యుల ఆత్మవిశ్వాసం, భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పం గురించి రాష్ట్రపతి తన ప్రసంగంలో వివరంగా చర్చించారు.
అమెరికా నుంచి భారతదేశానికి అక్రమ వలసదారులు తిరిగి వచ్చారు. ఈ అంశంపై మొదటిసారిగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. చట్టవిరుద్ధంగా నివసిస్తున్న పౌరులను తిరిగి స్వదేశానికి తీసుకురావడం దేశాల బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. అమెరికాలో అక్రమ వలసదారులుగా ప్రకటించిన 104 మంది భారతీయులు బుధవారం పంజాబ్‌లోని అమృత్సర్‌కు తిరిగి వచ్చారు. ఆ విమానం బుధవారం శ్రీ గురు రామ్‌దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
మహీంద్రా ఫిబ్రవరి నెలలో తన అనేక మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అత్యంత ప్రజా దారణ పొందిన ఎస్‌యూవీ మహీంద్రా థార్ పై కూడా కంపెనీ తగ్గింపు ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ఫిబ్రవరి నెల వరకు మాత్రమే వర్తిస్తుంది. కాగా.. మహీంద్రా థార్‌కు రూ.1.25 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించింది.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా వాహన కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. మహీంద్రా ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ పోర్ట్‌ఫోలియోలో అనేక మోడళ్లు ఉన్నాయి. అయితే.. అందులో ఎంట్రీ లెవల్ మోడల్ XUV400కు ఉన్న క్రేజే వేరు. ఈ కారు కొనాలనుకునేవారికి తాజాగా కంపెనీ శుభవార్త చెప్పింది.
విజయవాడ లోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని వైసీపీ నేతల బృందం కలిశారు.. ఏపీలో కార్పొరేషన్ల డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, వైఎస్ ఛైర్మన్ల ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు..
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆనందకరమైన, ఆశ్చర్యకరమైన విషయం జరిగిందని మాజీ మంత్రి బొత్స సత్యన్నారాయణ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో గురజాడ కవితను ప్రస్తావించడం ఆనందకరమైతే.. ఈ ప్రాంతం అభివృద్ధికి కనీస కేటాయింపులు లేక పోవడం బాధాకరం. మా మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు లబ్ధి పొందాలని రాష్ట్ర ప్రభుత్వాలు చూడటం సహజం.
రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లకి వైసీపీ విప్ జారీ చేసింది. తెరచాటు రాజకీయాల నేపథ్యంలో విప్ జారీ చేసింది.. విప్ ధిక్కరిస్తే ఎన్నికల కమిషన్ అనర్హత వేటు వేయనుంది. రేపు పలు డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి.. తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్ లకు డిప్యూటీ మేయర్ల ఎన్నికలు నిర్వహించనున్నారు.
పార్టీ పదవులు పొందిన కార్యకర్తలందరికీ వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందనలు తెలిపారు.. పదవులు పొందిన వారందరూ పార్టీ గెలుపు కోసం పని చేయాలని కోరారు. పార్టీ అన్నాక చిన్న చిన్న విభేదాలు ఉంటాయని.. వాటన్నింటినీ పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. కరోనా సమయంలో ఇచ్చిన హామీలు చేసింది జగన్ మాత్రమే అన్నారు.. ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు అంటున్నారన్నారు. ఎంఏ ఎకనామిక్స్, ఆర్థిక నిపుణుడు అయినా చంద్రబాబు ఇవన్నీ…
వైసీపీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఈనెల 5వ తేదీన వైసీపీ తలపెట్టిన ఫీజు పోరు ర్యాలీకి అనుమతివ్వాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కు మెయిల్ ద్వారా వినతిపత్రం పంపారు. శాసన మండలి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ర్యాలీకి అనుమతివ్వాలని ఎన్నికల అధికారిని కోరారు.
హిందూ మతంలోని ప్రత్యేక పండుగలలో వసంత్ పంచమి ఒకటి. వసంత పంచమి రోజున మహా కుంభమేళాలో నాలుగవ రాజస్నానం నిర్వహిస్తారు. వసంత పంచమి ఫిబ్రవరి 3న రానుంది. నాలుగవ రాజస్నానం రోజున బ్రహ్మ ముహూర్తం సాయంత్రం 5.23 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.16 గంటలకు ముగుస్తుంది. పవిత్ర నదుల్లో స్నానాలు కూడా ఆచరిస్తారు. అయితే వసంత పంచమినాడు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఆ రోజు మర్చిపోయి కూడా కొన్ని పనులు చేయకూడదు. ఈ నేపథ్యంలో…