మహీంద్రా కంపెనీ ఫిబ్రవరి నెలలో తన అనేక మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అత్యంత ప్రజా దారణ పొందిన ఎస్‌యూవీ మహీంద్రా థార్ పై కూడా కంపెనీ తగ్గింపు ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ఫిబ్రవరి నెల వరకు మాత్రమే వర్తిస్తుంది. కాగా.. మహీంద్రా థార్‌కు రూ.1.25 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ఫిబ్రవరి నెలలో ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. థార్ 4WD పెట్రోల్, డీజిల్ ఎడిషన్లు రెండూ రూ. లక్ష వరకు తగ్గింపును పొందుతుండగా.. థార్ 2WD డీజిల్ వేరియంట్ రూ. 50,000 వరకు తగ్గింపును అందిస్తోంది. థార్ 2WD పెట్రోల్ వేరియంట్ పై అత్యధికంగా రూ. 1.25 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. కేవలం 2024లో తయారైన మోడళ్లకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఇటీవల విడుదలైన మహీంద్రా థార్ రాక్స్ పై డిస్కౌంట్ వర్తించదు.
READ MORE: Pattudala Review : అజిత్ కుమార్ ‘పట్టుదల’ రివ్యూ
ఇదిలా ఉండగా.. గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజు కంపెనీ మహీంద్రా థార్ రాక్స్ ను విడుదల చేసింది. విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ 5 డోర్ బుకింగ్స్ లో దూసుకుపోయింది. కాగా.. మహీంద్రా 5డోర్ థార్ పెట్రోల్, డీజిల్ రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉంది. పెట్రోల్ బేసిక్ వేరియంట్ ధర రూ.12.99 లక్షల (ఎక్స్-షోరూమ్), డీజిల్ వెర్షన్ రూ.13.99 లక్షల (ఎక్స్- షోరూమ్) నుంచి ప్రారంభం అవుతోంది. ఇందులోని 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 160 బీహెచ్‌పీ శక్తిని, 330ఎన్‌ఎమ్ టార్క్‌ని అందిస్తుంది. ఇక 2.2 లీటర్ల mHawk డీజిల్ ఇంజిన్ 150 బీహెచ్‌పీ శక్తిని, 330ఎమ్‌ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజిన్లు సిక్స్ స్పీడ్ మాన్యువల్, ఆటో మెటిక్ గేర్ బాక్స్‌తో వస్తున్నాయి. సిక్స్ డబుల్ స్టాక్డ్ స్లాట్స్, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్‌లు ఉన్నాయి. వెనకభాగంలో సీ- షేప్డ్ ఎల్‌ఈడీ టెయిల్‌లైట్స్, టెయిల్‌గేట్- మౌంటెడ్ స్పేర్ వీల్ అమర్చారు. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టంతో వస్తోంది. ఇది యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకి సపోర్ట్ చేస్తుంది.
READ MORE: Mahindra XUV400 : బంఫర్ ఆఫర్.. ఈ మహీంద్రా ఎలక్ట్రిక్ కారుపై ఏకంగా 4లక్షల తగ్గింపు!