దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా వాహన కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. మహీంద్రా ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ పోర్ట్‌ఫోలియోలో అనేక మోడళ్లు ఉన్నాయి. అయితే.. అందులో ఎంట్రీ లెవల్ మోడల్ XUV400కు ఉన్న క్రేజే వేరు. ఈ కారు కొనాలనుకునేవారికి తాజాగా కంపెనీ శుభవార్త చెప్పింది. ఈ నెలలో ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీపై రూ.4 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. నిజానికి.. ఈ కారుకు చెందిన 2024 స్టాక్ ఇంకా మిగిలి ఉంది. వీటన్నింటినీ విక్రయించేందుకు కంపెనీ ఇంత భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ కారు ఈసీ (EC), ఈఎల్ (EL) వేరియంట్లలో అందుబాటులో ఉంది. కాగా.. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ యొక్క మొదటి రెండు ఈఎల్ ప్రో వేరియంట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. XUV400 EL (2024) మోడల్‌పై గరిష్టంగా రూ. 4 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. XUV400 EL (2025) మోడల్ కూడా రూ. 2.50 లక్షల తగ్గింపుతో వస్తుంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 15.49 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.
మహీంద్రా XUV400 ఫీచర్లు ఇవే..
టైర్ ప్రైజర్ అలర్ట్, డోర్ ఓపెనింగ్ అలర్ట్, ఓవర్ స్పీడ్ అలెర్ట్, జోయో ఫెన్స్ అలెర్ట్, హై టెంపరేచర్ అలెర్ట్, ఛార్జర్ ట్రబుల్ అలెర్ట్, రోడ్ సైడ్ అసిస్టెన్స్, వాలెట్ మోడ్, షేర్ మై లోకేషన్ వంటి ఫీచర్లను మహీంద్రా XUV400 అందిస్తోంది. సేఫ్టీ ఫీచర్లను చూసుకుంటే మహీంద్రా XUV400 Pro భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో స్టాండర్డుగా 6 ఎయిర్ బ్యాగ్ లు, ESP, DBMS, IRVMతో ఆటో డిమ్మింగ్, 4 వీల్ డిస్క్ బ్రేక్ లు, ఐసోఫిక్స్ సీట్లు ఉన్నాయి. మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ కారు EL Pro లో ఒకటి 34.5 kWh బ్యాటరీ ప్యాక్ తో, 7.2 kW AC ఛార్జర్ తో అమర్చబడి ఉంటుంది. మరొకటి 39.4 kWh AC ఛార్జర్ తో వస్తుంది. ఇక ఎంట్రీ లెవెల్ EC ప్రో 34.5kWhబ్యాటరీ ప్యాక్, టైప్ 3.3 kW AC ఛార్జింగ్ ఆప్షన్ కలిగి ఉంది.
గమనిక: వివిధ ప్లాట్‌ఫామ్‌ల సహాయంతో కారుపై లభించే డిస్కౌంట్లను ఈ వార్తలో ప్రస్తావించాం. ఈ తగ్గింపు మీ నగరంలో లేదా డీలర్‌లో ఎక్కువ లేదా తక్కువ ఉండవచ్చు. కారు కొనడానికి ముందు, డిస్కౌంట్‌కు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోండి.