విజయవాడ లోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని వైసీపీ నేతల బృందం కలిశారు.. ఏపీలో కార్పొరేషన్ల డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, వైఎస్ ఛైర్మన్ల ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.. ఎన్నికలలో అక్రమ పద్ధతుల్లో టీడీపీ లబ్ధి పొందాలని చూస్తుందని ఆరోపించారు.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తులను బెదిరింపులకు గురిచేస్తూ వారి నివాసాలను కూలదిస్తున్నారన్నారు.. ఫ్యాన్ గుర్తుపై వైసీపీ తరఫున పోటీ చేసిన వారిని లాక్కోవాలని చూడటం అప్రజాస్వామికమన్నారు.. బయటకు వెళ్లి దొడ్డిదారిన సహరించాలనుకుంటే పార్టీ విప్ జారీ చేశామని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.. ఆ మేరకు ఎన్నికల కమిషనర్ కు వినతిపత్రం అందించారు. ఎన్నికల కమిషనర్ ను కలిసిన వారిలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్యెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, రుహుల్లా, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ లు ఉన్నారు..
READ MORE: Botsa Satyanarayana : బడ్జెట్ ఆనందం, ఆశ్చర్యకరమైంది.. బడ్జెట్ పై బొత్స వ్యాఖ్యలు
ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. “తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన అక్రమాలు వివరించేందుకు ఎన్నికల కమిషన్ దగ్గరకు వచ్చాం.. పోటీ చేసే వ్యక్తుల మీద తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు.. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నిలువునా భవంతులు కూల్చి వేస్తున్నారు.. ఎవరైనా పోటీలో ఉంటే ఇదే తరహాలో ఉంటుందని బెదిరిస్తున్నారు.. రాజీనామాలు చేసి వస్తేనే పార్టీలో చేరుకుంటామన్న చంద్రబాబు మాటలు ఇక్కడ వర్తించవా.. వైసీపీ పార్టీ తరఫున ఫ్యాన్ గుర్తుపై గెలిచిన వారిని లాక్కోవాలని చూడటం దుర్మార్గం.. బయటకు వెళ్లాలనుకున్న వారిపై విప్ జారీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. ఏకపక్షంగా వ్యవహరించే అధికారులను మార్చాలని కోరుతున్నాం.. ఇవాళ కిర్లంపూడి లో ముద్రగడ పద్మనాభం ఇంటి గేటును ట్రాక్టర్ తో గుద్ది డ్యామేజ్ చేశారు.. అక్కడ ఉన్న ఫ్లెక్సీలు చింపి అరాచకమైన పరిస్థితులు సృష్టించారు.. దాడి చేసిన వ్యక్తిని అడిగితే నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పారు.. తక్షణమే ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలి.. ఖండించాలి.. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యంలో ప్రతీ ఒక్కరూ ఖండించాలి.. ఘటనకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి..” అని డిమాండ్ చేశారు.
READ MORE: Awadhesh Prasad: ‘‘రామ్, సీతా మీరు ఎక్కడ ఉన్నారు..?’’ విలపించిన అయోధ్య ఎంపీ..