అమరావతి రాజధాని రైతులు ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో మహాపాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. వారి పాదయాత్ర నేటితో 31వ రోజుకు చేరగా.. ఈరోజు నెల్లూరు జిల్లా మరుపూరు నుంచి రైతుల పాదయాత్ర ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలోకి రాజధాని రైతుల పాదయాత్ర ప్రవేశించగా… వారికి టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈరోజు రైతుల పాదయాత్రలో బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు కూడా పాల్గొన్నారు. Read Also: తిరుమల దర్శనాలను వాయిదా…
బుధవారం రోజు టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు తమ ప్రయాణాలను వారం రోజుల పాటు వాయిదా వేసుకోవాలని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. దర్శనం టిక్కెట్లను రీ షెడ్యూల్ చేసుకునే వెసులుబాటును త్వరలోనే కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దర్శనం టికెట్లు ఉన్నవారు వచ్చే ఆరు నెలల్లో ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చని సూచించారు. Read Also: విరిగిపడ్డ కొండ చరియలు.. ఘాట్ రోడ్డు…
ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెలకు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. ఫిలింఛాంబర్‌లో సిరివెన్నెల పార్థివదేహానికి తెలంగాణ మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ… సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తెలుగు సినీ పరిశ్రమ, సాహిత్య కవులకు తీరని లోటు అని పేర్కొన్నారు. పండితులు, పామరులను ఆయన రచనలు మెప్పించాయన్న హరీష్‌రావు. సమాజంలో గొప్ప చైతన్యం కలిగించడానికి పాటలు రాశారని కొనియాడారు. సమాజంలో అసమానతలు తొలగించి చైతన్యం నింపేలా పాటలు…
దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో పార్లమెంటులోని 59వ గదిలో మంటలు చెలరేగాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే కొద్దిసేపటికే అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేశాయని వివరించాయి. ఈ ప్రమాదానికి గల కారణం తెలియరాలేదని, విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు. కాగా నవంబర్ 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. Read Also: రైతుల సంక్షేమంలో దేశానికే కేసీఆర్ మార్గదర్శి…
వెండితెరపైనే కాదు ఓటీటీ వేదికపైనా నందమూరి బాలకృష్ణ విజృంభిస్తున్నాడు. వెండితెరపై తన సినిమాలతో కనకవర్షం కురిపించే బాలయ్య.. ఓటీటీలో అత్యధిక వ్యూస్‌ను కొల్లగొడుతున్నాడు. బాలయ్య తొలిసారిగా ఓటీటీలో చేసిన టాక్‌షో ‘అన్‌స్టాపబుల్’. ఈ టాక్ షో ఆహా ఓటీటీలో ప్రసారమవుతోంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్లు టెలీకాస్ట్ అయ్యాయి. మొదటి ఎపిసోడ్‌లో మంచు మోహన్‌బాబును బాలయ్య ఇంటర్వ్యూ చేయగా.. రెండో ఎపిసోడ్‌లో నేచురల్ స్టార్ నానితో కలిసి బాలయ్య సందడి చేశాడు. Read Also: ఏడాది కాలంగా టాలీవుడ్‌లో…
గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు మరోసారి షాకిచ్చాయి. ప్రతి నెలా మొదటి తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు సమీక్షిస్తుంటాయి. తాజా సమీక్షలో భాగంగా కమర్షియల్ (వ్యాపార అవసరాలకు) గ్యాస్ సిలిండర్ ధరను రూ.103.50 మేర ఆయిల్ కంపెనీలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,174కి చేరింది. అటు హైదరాబాద్ మార్కెట్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,278గా నమోదైంది. కాగా గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ల విషయంలో మాత్రం…
హైదరాబాద్: టాలీవుడ్ లెజెండరీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఫిలింఛాంబర్‌లో ఉంచారు. ఆయనకు తుది నివాళులు అర్పించడానికి పలువురు సినీ ప్రముఖులు ఫిలింఛాంబర్‌కు తరలివస్తున్నారు. బుధవారం ఉదయం సిరివెన్నెల పార్థివదేహాన్ని త్రివిక్రమ్, రాజమౌళి, కీరవాణి, విక్టరీ వెంకటేష్, సాయికుమార్, తనికెళ్ల భరణి, మణిశర్మ, టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఎస్వీ కృష్ణారెడ్డి, మారుతి, మురళీమోహన్, నందినీరెడ్డి తదితరులు సందర్శించి నివాళులర్పించారు. తాజాగా హీరో నందమూరి బాలకృష్ణ కూడా సిరివెన్నెల…
తెలంగాణలో కరెంట్ ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. డిస్కంలు సమర్పించిన ఏఆర్‌ఆర్‌లు(వార్షిక ఆదాయ అవసరాలు) ఈ అంశాన్ని సూచిస్తున్నాయి. విద్యుత్ డిస్కంలు 2021-22, 2022-23 సంవత్సరాలలో ఆదాయ, వ్యయాలకు సంబంధించిన ఏఆర్ఆర్ ప్రతిపాదనలను మంగళవారం విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి సమర్పించాయి. ఈ సందర్భంగా తాము రూ.21,550 కోట్ల రెవెన్యూ లోటును కలిగి ఉన్నామని.. దీనిని పూడ్చాలంటే విద్యుత్ ఛార్జీలు పెంచక తప్పదని ప్రతిపాదనల్లో డిస్కంలు స్పష్టం చేశాయి. 2021-22 కాలానికి రూ.45,618 కోట్ల లోటు, 2022-23 కాలానికి…
విజయవాడ నగరంలో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తోందన్న వార్తలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. టూటౌన్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్నట్లు సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డయ్యాయి. అయితే చెడ్డీ గ్యాంగ్ ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడుతుందన్న విషయంపై పోలీసులకు స్పష్టత అందాల్సి ఉంది. చెడ్డీ గ్యాంగ్ సంచారంపై ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారి వల్ల ఎవరికైనా నష్టం కలిగితే ప్రజలు వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. Read Also: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు…
అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో కాల్పులు కలకలం సృష్టించాయి. డెట్రాయిట్ నగరానికి సమీపంలోని ఓ పాఠశాలలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో పాఠశాలలోని ముగ్గురు విద్యార్థులు మరణించారు. ఈ ఘటనలో ఓ టీచర్ సహా మరో ఏడుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. Read Also: ఇండో-పాక్ సరిహద్దుకు అమిత్‌షా సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు పాఠశాలను చుట్టుముట్టారు. అనంతరం 15 ఏళ్ల అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి ఓ తుపాకీని, 15-20 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం…