వెండితెరపైనే కాదు ఓటీటీ వేదికపైనా నందమూరి బాలకృష్ణ విజృంభిస్తున్నాడు. వెండితెరపై తన సినిమాలతో కనకవర్షం కురిపించే బాలయ్య.. ఓటీటీలో అత్యధిక వ్యూస్‌ను కొల్లగొడుతున్నాడు. బాలయ్య తొలిసారిగా ఓటీటీలో చేసిన టాక్‌షో ‘అన్‌స్టాపబుల్’. ఈ టాక్ షో ఆహా ఓటీటీలో ప్రసారమవుతోంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్లు టెలీకాస్ట్ అయ్యాయి. మొదటి ఎపిసోడ్‌లో మంచు మోహన్‌బాబును బాలయ్య ఇంటర్వ్యూ చేయగా.. రెండో ఎపిసోడ్‌లో నేచురల్ స్టార్ నానితో కలిసి బాలయ్య సందడి చేశాడు.
Read Also: ఏడాది కాలంగా టాలీవుడ్‌లో వరుస విషాదాలు
తాజాగా ఈ షో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఆహా ఓటీటీలో అత్యధిక ప్లే వ్యూస్ వచ్చిన టాక్ షోగా ‘అన్‌స్టాపబుల్’ నిలిచింది. ఈ షోకు 4 మిలియన్ ప్లే వ్యూస్ వచ్చాయని ఆహా ప్రకటించింది. గతంలో ఆహా ఓటీటీ వేదికపై సమంత సామ్‌జామ్, రానా యారీ నెం.1, వైవా హర్ష తమాషా, సుమ ఆల్‌ఈజ్‌వెల్ లాంటి టాక్ షోలు ప్రసారమయ్యాయి. కానీ ఆయా షోలకు రాని ప్లే వ్యూస్ బాలయ్య షోకు వచ్చాయి. ప్రస్తుతం బాలయ్య తన భుజానికి శస్త్రచికిత్స చేయించుకోవడంతో మూడో ఎపిసోడ్ టెలీకాస్ట్ కాలేదు. త్వరలోనే మూడో ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్‌కు ముఖ్య అతిథులుగా ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, దర్శకుడు అనిల్ రావిపూడి హాజరయ్యారు. వీరి ఎపిసోడ్ వచ్చే వారం టెలీకాస్ట్ అయ్యే అవకాశముంది.
