ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెలకు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. ఫిలింఛాంబర్‌లో సిరివెన్నెల పార్థివదేహానికి తెలంగాణ మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ… సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తెలుగు సినీ పరిశ్రమ, సాహిత్య కవులకు తీరని లోటు అని పేర్కొన్నారు. పండితులు, పామరులను ఆయన రచనలు మెప్పించాయన్న హరీష్‌రావు. సమాజంలో గొప్ప చైతన్యం కలిగించడానికి పాటలు రాశారని కొనియాడారు. సమాజంలో అసమానతలు తొలగించి చైతన్యం నింపేలా పాటలు ఉంటాయని హరీష్ రావు పేర్కొన్నారు.
Read Also: ఇండస్ట్రీలో మరో విషాదం… శోకసంద్రంలో హీరో ఫ్యామిలీ
అటు మంత్రి తలసాని మాట్లాడుతూ… సిరివెన్నెల పాటలు చాలామందికి కనువిప్పు అన్నారు. సిరివెన్నెల మరణం తెలుగు చిత్రసీమకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ తీరనిలోటు అని తలసాని పేర్కొన్నారు. ఇప్పుడున్న రచయితలు సిరివెన్నెల పాటలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సిరివెన్నెల కుటుంబీకులు ధైర్యంగా ఉండాలని తలసాని అన్నారు.
మరోవైపు ఏపీ ప్రభుత్వం తరఫున సిరివెన్నెల భౌతికకాయానికి మంత్రి పేర్ని నాని నివాళులుర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి సిరివెన్నెల అని పేర్కొన్నారు. ఏపీ ప్రజల తరపున సిరివెన్నెల కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిరివెన్నెల కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్ని నాని స్పష్టం చేశారు.