ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. గత మూడు రోజులుగా ముంబైలో కురుస్తున్న వర్షాలకు పిచ్, అవుట్ ఫీల్డ్ తడిగా మారాయి. ఈ క్రమంలో అంపైర్లు మైదానాన్ని పరిశీలించారు. ఆటకు అనువుగా లేకపోవడంతో టాస్‌ను కాసేపు వాయిదా వేశారు. గ్రౌండ్ సిబ్బంది, అంపైర్లు ఉ.9:30గంటలకు మరోసారి మైదానాన్ని పరిశీలించనున్నారు. ఆ తర్వాతే టాస్ వేసి మ్యాచ్‌ను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో రెండో టెస్ట్ సుమారు 30 నిమిషాల…
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలుడిపై యువతి లైంగిక దాడి చేయడమే కాకుండా అతడిని బెదిరించి రూ.16 లక్షల సొత్తును కాజేసింది. వివరాల్లోకి వెళ్తే… టోలిచౌకీలో నివాసం ఉంటున్న కుటుంబం ఇటీవల జూబ్లీహిల్స్‌కు మారింది. అయితే ఇల్లు సద్దుతున్న క్రమంలో 20 తులాల బంగారం కనిపించలేదు. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో తల్లి 9వ తరగతి చదువుతున్న కుమారుడిని ప్రశ్నించగా.. విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ఆ బంగారం తీసింది తానేనని బాలుడు చెప్పడంతో తల్లి…
2022 ఏడాది రాకముందే సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కొత్త ఏడాదిలో సిమెంట్ ధర మరింత పెరగనుంది. ప్రస్తుతం రూ.385 వరకు పలుకుతున్న 50 కిలోల సిమెంట్ బస్తా ధర మరో రూ.20 పెరగనుందని క్రిసిల్ అంచనా వేసింది. ఇదే జరిగితే గతంలో ఎన్నడూ లేని విధంగా బస్తా సిమెంట్ ధర రూ.400 దాటనుంది. సిమెంట్ తయారీ ధరలో ప్రధాన ముడి పదార్థాలైన బొగ్గు, పెట్‌కోక్‌ల ధరలు ఇటీవల విపరీతంగా పెరగడంతో త్వరలో సిమెంట్ బస్తాల ధరలు…
ముంబై వేదికగా నేటి నుంచి భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ జరగనుంది. ఉదయం 9:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టెస్టులో విజయం దాకా వచ్చి డ్రాతో సరిపెట్టుకున్న భారత్.. ఈ టెస్టులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ఓడిపోయే టెస్టును అద్భుతంగా పోరాడి డ్రా చేసుకోవడంతో న్యూజిలాండ్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. టీమిండియా రెగ్యులర్ టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ టెస్టులో బరిలోకి దిగనున్నాడు. వ్యక్తిగత కారణాల…
✍ నేడు తిరుపతితో పాటు నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన… వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, పంటలను పరిశీలించనున్న సీఎం జగన్✍ అమరావతి: నేడు టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం, దర్శి మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై చర్చ✍ అమరావతి: నేడు మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్, హాజరుకావాలని ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం, పీఆర్సీ సహా ఉద్యోగుల సమస్యలపై చర్చ✍ నేడు 33వ రోజుకు చేరిన అమరావతి రాజధాని రైతుల మహాపాదయాత్ర… నెల్లూరు…
తవ్వకాల్లో బయటపడిన వస్తువులపై అందరికీ ఆసక్తి ఉంటుంది. అలాగే అవి ఎక్కడ బయటపడ్డాయని తెలుసుకునేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే తాజాగా పురాతన నాణేలతో నిండిన కుండ ఒకటి బయట పడింది. ఎక్కడంటే మధ్య ప్రదేశ్‌లోని టికామ్‌ఘర్ జిల్లాలో. అయితే టికామ్‌ఘర్ పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో గల నందన్‌వారా గ్రామంలోని మట్టి క్వారీలో మంగళవారం ఉదయం జేసీబీతో మట్టిని తవ్వుతున్న సమయంలో ఒక కుండ కార్మికులకు కనిపించింది. దీంతో కార్మికులు ఆ కుండను బయటకు తీశారు. అందులో…
మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలతోనే ఏపీ అతలాకుతలమైంది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది ఏపీ ప్రభుత్వం. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో తుఫాన్ ఏపీపై విరుచుకుపడేందుకు సిద్ధమవుతోంది. తాజాగా వాతావరణ శాఖ వెల్లడించిన ఫలితాల ప్రకారం.. గత నెల 29న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఇప్పుడు వాయుగుండంగా బలపడి ఎల్లుండి తుఫాన్ గా మారే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించారు. ఏపీ, ఒడిశాలో 4న ఉదయం తీరం దాటుతుందని అంచనా వేస్తున్నట్లు వాతావరణ…
వరద ప్రభావిత ప్రాంతాలైన వైయస్సార్ కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్న సీఎం జగన్ రేపు, ఎల్లుండి పర్యటించనున్నారు. తొలిరోజు వైయస్సార్ కడప, చిత్తూరు జిల్లాలలో పర్యటించి నేరుగా బాధిత ప్రజలు, రైతులతో సీఎం ఇంటరాక్ట్ కానున్నారు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును సీఎం పరిశీలించనున్నారు. ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలతో వరద నష్టం, సహాయక చర్యలపై నేరుగా ప్రజలతో సీఎం ముచ్చటిస్తారు. మునుపెన్నడూ లేని విధంగా భారీ వర్షాలతో తీవ్రంగా ప్రభావితమైన…
రేపటి నుండి ఈ నెల 8 వరకు మావోయిస్టుల వారోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెంలోని అటవీ ప్రాంతంలో పర్యటించారు. డీజీపీ మహేందర్ రెడ్డి మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఒకటైన చర్ల మండలం చెన్నాపురంలో పర్యటించిన అనంతరం సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్ లో మావోయిస్టులపై ఉక్కుపాదం మోపెందుకు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మావోయిస్టుల వారోత్సవాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత పెంచాలని, సరిహద్దు…
తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో అద్భుతమైన పాటలను అందించిన ప్రముఖ గేయ రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి నిన్న కన్నుమూసిన విషయం తెలిసింది. గత నెల 24న న్యుమోనియాతో బాధపడుతూ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరిన ఆయన నిన్న ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అయితే సిరివెన్నెల…