చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజాకు పెద్ద ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో తిరుపతిలో దిగాల్సిన విమానం బెంగళూరులో సురక్షితంగా ల్యాండైంది.
Read Also: అమరావతి రాజధాని రైతులకు టీటీడీ గుడ్ న్యూస్
వాస్తవానికి ఎమ్మెల్యే రోజా ప్రయాణిస్తున్న విమానం రాజమండ్రి నుంచి తిరుపతి రావాల్సి ఉంది. ఈ మేరకు ఎమ్మెల్యే రోజా ఎక్కిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం తిరుపతికి ఈరోజు ఉ.10:55 గంటలకు చేరుకోవాల్సి ఉంది. కానీ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ విషయాన్ని గమనించిన పైలట్ చాకచాక్యంగా వ్యవహరించి విమానాన్ని బెంగళూరు వైపు మళ్లించాడు. దీంతో విమానంలోని 70 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ ప్రమాదంపై ఎమ్మెల్యే రోజా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ఇంకా విమానంలోనే ఉన్నాం. విమానం డోర్స్ ఇంకా ఓపెన్ కాలేదు. పైలట్‌కు ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదు’ అని రోజా ఓ వీడియోను విడుదల చేశారు.