ప్రస్తుత కాలంలో ఓ మనిషి మరో మనిషికి సాయం చేయడమే గగనంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి ఏకంగా ఓ మూగజీవాన్ని కాపాడి అందరి మన్ననలు పొందుతున్నాడు. తమిళనాడులోని పెరంబలూరుకు చెందిన ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ కోతిని కాపాడి మానవత్వం చాటుకున్నాడు. ప్రమాదంలో గాయపడిన కోతి పిల్ల శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండగా తన నోటితో దానికి గాలి అందించాడు. అది భయంతో అతన్ని కొరికినా.. ఆ వ్యక్తి దాని ప్రాణాలు కాపాడాడు.
Read Also: 12 బ్యాంకుల్లో 41,177 పోస్టులు ఖాళీ..!
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తమిళనాడులోని కునామ్‌కు చెందిన డ్రైవర్ ప్రభు ఈనెల 9న బైకుపై వెళ్తుండగా.. ఓ చెట్టు కింద గాయాలతో పడి ఉన్న కోతి పిల్ల కనిపించింది. కుక్కల దాడిలో కోతి గాయపడినట్లు గమనించిన డ్రైవర్ ప్రభు… అపస్మారక స్థితిలోకి వెళ్లిన కోతి గుండెను పంపింగ్ చేశాడు. దీంతో ఆ కోతికి ఊపిరి అందడంతో వెంటనే దానిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించాడు. కాగా డ్రైవర్ ప్రభు మానవత్వాన్ని చూసి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. అతడిని ఆపద్భాందవుడు.. దేవుడు అంటూ పలువురు కీర్తిస్తున్నారు. ఈ వీడియోను ఓ ఫారెస్ట్ అధికారి ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా… తమిళ హీరో సూర్య దీనిని తన ట్విట్టర్ ఖాతాలో రీట్వీట్ చేస్తూ నమస్కరిస్తున్న ఎమోజీని షేర్ చేశాడు.
— Suriya Sivakumar (@Suriya_offl) December 13, 2021