మెగాస్టార్ ‘ఆచార్య’కు పోటీగా సూర్య సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ అగ్ర హీరో సూర్య సినిమాలు ఇటీవల వరుసగా ఓటీటీల్లో విడుదలయ్యాయి. గత ఏడాది ఆకాశమే నీ హద్దురా, ఈ ఏడాది జై భీమ్ సినిమాలతో సూర్య మంచి హిట్లు అందుకున్నా ఆ సినిమాలు థియేటర్లలో విడుదలైతే బాగుండేదని అభిమానులు భావించారు. ఈ నేపథ్యంలో సూర్య కొత్త సినిమా థియేటర్లలోనే రాబోతోంది. సూర్య నటించిన తాజా సినిమా ‘ఈటీ’ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఐదు భాషల్లో విడుదల కానుంది.
Read Also: ‘పుష్ప’ మాస్ ట్రీట్… ఇంటర్వెల్‌కు ముందే సమంత ఐటమ్ సాంగ్?
Also Read
సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ‘ఈటీ’ మూవీకి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళనాట విలక్షణ దర్శకుడిగా పాండిరాజ్‌కు పేరుంది. గతంలో పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య నటించాడు కూడా. దీంతో ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ‘ఈటీ’ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. రత్నవేలు ఫొటోగ్రఫీ అందిస్తుండగా డి.ఇమాన్ సంగీతం సమకూరుస్తున్నాడు. కాగా సూర్య ‘ఈటీ’ విడుదలవుతున్న రోజే మెగాస్టార్ ‘ఆచార్య’ కూడా విడుదలవుతోంది. దీంతో ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆచార్యకు పోటీగా వస్తున్న ‘ఈటీ’కి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఎక్కువ సంఖ్యలో దొరకడం కష్టమనే చెప్పాలి.

తాజావార్తలు
-
CM Vijay vs MK Stalin: ‘అసెంబ్లీని రీల్స్ చేసే వేదికగా మార్చొద్దు’.. సీఎం విజయ్‌పై స్టాలిన్ విమర్శలు
-
YS Jagan: పరీక్ష లేకుండానే 372 ఉద్యోగాలు.. ఆ తర్వాత జీవోలు ఎందుకు మార్చారు?
-
Kashmiri Pandits: టార్గెట్ కాశ్మీరీ పండిట్స్..ఉద్యోగాలు మానకపోతే చం*పేస్తాం!
-
YS Jagan: డీఎస్సీలో తవ్వేకొద్దీ అక్రమాలు.. అది అంటేనే చంద్రబాబుకు బీపీ పెరిగిపోతుంది..!
-
Lucknow: ఏడాది క్రితమే పెళ్లి.. ఇప్పుడు భార్యకు ప్రియుడితో మరో పెళ్లి.!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?