ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ భారత్‌లోనూ తన ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌కు చెందిన 73 ఏళ్ల వ్యక్తి ఒమిక్రాన్ కరోనా వేరియంట్ కారణంగా మరణించినట్లు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ సోకిన అతడు కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం నాడు మరణించినట్లు వారు పేర్కొన్నారు. Read Also: వస్త్రాలపై జీఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా అయితే ఒమిక్రాన్ కారణంగా చనిపోయిన వృద్ధుడికి హైపర్‌టెన్షన్‌తో పాటు డయాబెటిస్…
ఇటీవల విడుదలైన పుష్ఫ సినిమాలు అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే పుష్పరాజ్ అనే పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కస్టమ్స్ శాఖలో పని చేస్తున్న ముగ్గురు పుష్పరాజ్ అవతారం ఎత్తారు. బాధ్యతయుతమైన పోస్టుల్లో ఉండి ఎర్రచందనం స్మగ్లింగ్‌కు తెరలేపారు ఆ అధికారులు.. సీబీఐ చొరవతో ఆ అధికారులు గుట్టు బయటపడింది. కస్టమ్స్ అధికారులు ఓ ముఠాతో కలిసి ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు తెరలేపారు. దీంతో కస్టమ్స్ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది.…
విశాఖ జిల్లా వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు సొంత పార్టీ కార్యకర్తల నుంచే అసమ్మతి సెగ ఎదురైంది. పాయకరావుపేట మండలం రాజవరం గ్రామంలో మంచినీటి పైపులైన్ ప్రారంభించడానికి వెళ్లిన ఎమ్మెల్యే గొల్ల బాబూరావును వైసీపీ కార్యకర్తలు అడ్డుకుని గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. జగన్ ముద్దు- ఎమ్మెల్యే వద్దు అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం ఎమ్మెల్యే కారుకు అడ్డంగా రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఎమ్మెల్యే మద్దతుదారులు, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. Read…
కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ మళ్లీ సొంతగూటికి చేరనున్నారు. ఈ మేరకు గురువారం నాడు హైదరాబాద్ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను మాజీ మేయర్ రవీందర్ సింగ్ కలిశారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక సంస్థలలో నెలకొన్న సమస్యలు, సిక్కు సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ సమస్యలను పరిష్కరిస్తామని రవీందర్ సింగ్‌కు కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. Read…
దేశంలోనే అతిపెద్ద రియాలిటీషోలలో బిగ్‌బాస్ ఒకటి. ఈ షోకు ఏ భాషలో అయినా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇటీవల తెలుగు బిగ్‌బాస్-5 సీజన్ ముగిసింది. వీజే సన్నీ విజేతగా… యూట్యూబర్ షణ్ముఖ్ రన్నరప్‌గా నిలిచారు. మరోవైపు ఈ సీజన్ ఫినాలే ఎపిసోడ్‌కు టీఆర్పీ రేటింగ్ బాగానే వచ్చింది. చాలా మంది సెలబ్రిటీలు ఫినాలే ఎపిసోడ్‌కు రావడంతో ప్రేక్షకులు టీవీకి అతుక్కుపోయారని టీఆర్పీని చూస్తే అర్ధమవుతోంది. బ్రహ్మాస్త్ర టీమ్, పుష్ప టీమ్, పరంపర వెబ్ సిరీస్ టీమ్, శ్యామ్…
ప్రపంచ దేశాలను దక్షిణాఫ్రికాకు చెందిన కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తోంది. భారత్‌లోనూ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాలలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో కొత్తగా ఐదు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 67కి చేరింది. ఒమిక్రాన్ సోకిన బాధితులను ప్రభుత్వం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. Read Also: మళ్లీ కరోనా కల్లోలం.. ఆ రాష్ట్రాలకు కేంద్రం లేఖ మరోవైపు ఇండియాలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య వెయ్యి…
తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏకంగా భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్‌ను విమర్శిస్తూ ఆమె మాట్లాడటం ప్రస్తుతం రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ.. అంబేద్కర్ వల్ల మనకు ఎలాంటి హక్కులు రాలేదన్నారు. అంబేద్కర్ వల్ల సాధ్యం కానివి బాబూ జగ్జీవన్ రాం వల్ల సాధ్యమయ్యాయని ఎమ్మెల్యే శ్రీదేవి వ్యాఖ్యానించారు. Read Also: అశోక్ గజపతిరాజుకు హైకోర్టులో ఊరట ఈరోజు మనకు రాజ్యాంగ హక్కులు…
ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, ఏపీ ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ కోరాడు. థియేటర్ల సమస్యలపై ప్రభుత్వం నెలరోజులు సమయం ఇవ్వడం సంతోషంగానే ఉన్నా… థియేటర్ల సీజ్ అంశంపై పని ఒత్తిడిలో ఉండే జాయింట్ కలెక్టర్‌లను కలిస్తే ఉపయోగం ఏం ఉంటుందని ప్రశ్నించారు. కరోనాతో రెండేళ్ల పాటు ఎన్నో ఇబ్బందులు పడ్డామని.. ఓటీటీ కారణంగా ఎన్నో నష్టాలకు గురయ్యామని ఎన్వీ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.…
టెస్ట్ ఫార్మాట్‌కు సంబంధించి 2021కి టీమిండియా ఘనంగా వీడ్కోలు పలికింది. భారత్ ఈ ఏడాది 14 టెస్టులు ఆడగా… అందులో 8 విజయాలు, మూడు పరాజయాలు ఉన్నాయి. మూడు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత్… అక్కడ నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 3-1 తేడాతో చేజిక్కించుకుంది. అయితే జూన్ నెలలో ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ఐసీసీ…
టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తెలంగాణలో టిక్కెట్ రేట్లు అధికంగా ఉన్న కారణంగా ఇకపై తెలంగాణలో తాను నిర్మించే సినిమాలను విడుదల చేయనని నట్టికుమార్ ప్రకటించాడు. ఏపీలో మూసివేసిన థియేటర్లను తెరుచుకునేలా చర్యలు తీసుకున్న ఏపీ ప్రభుత్వానికి నట్టికుమార్ ధన్యవాదాలు తెలిపాడు. జీవో నంబర్ 35ను రద్దు చేయాలంటూ వైజాగ్ ఎగ్జిబిటర్లు ఎవరూ న్యాయస్థానానికి వెళ్లలేదని.. 224 మందికి తెలియకుండా కొంతమంది కోర్టుకు వెళ్లి ఫిర్యాదు చేశారని నట్టికుమార్ ఆరోపించాడు. Read Also: మహేష్…