బ్రేకింగ్… ఇండియాలో తొలి ఒమిక్రాన్ మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ భారత్‌లోనూ తన ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌కు చెందిన 73 ఏళ్ల వ్యక్తి ఒమిక్రాన్ కరోనా వేరియంట్ కారణంగా మరణించినట్లు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ సోకిన అతడు కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం నాడు మరణించినట్లు వారు పేర్కొన్నారు.
Read Also: వస్త్రాలపై జీఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా
Also Read
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
- Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
అయితే ఒమిక్రాన్ కారణంగా చనిపోయిన వృద్ధుడికి హైపర్‌టెన్షన్‌తో పాటు డయాబెటిస్ కూడా ఉందని అధికారులు నిర్ధారించారు. డిసెంబరు 15న 73 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని… ఈ క్రమంలోనే జ్వరం, దగ్గు, రినైటిస్ వంటి లక్షణాలతో బాధపడుతుండడం కారణంగా ఒమిక్రాన్ పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చిందన్నారు. అనంతరం డిసెంబర్ 21, 25 తేదీల్లో మరోసారి ఒమిక్రాన్ పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చిందని… అయితే ఒమిక్రాన్ నెగిటివ్ వచ్చిన తర్వాత పోస్ట్ కోవిడ్ న్యూమోనియా ఎఫెక్ట్ ద్వారా వృద్ధుడు మరణించాడని అధికారులు పేర్కొన్నారు. కాగా ఉదయ్‌పూర్‌లో ఇప్పటి వరకు 3 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. రాజస్థాన్రాష్ట్రంలో మొత్తం 69 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి.
మరోవైపు మహారాష్ట్రలో కూడా ఒమిక్రాన్ కారణంగా ఓ వ్యక్తి చనిపోయినట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. పుణెలోని పింప్రీ చించువాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 52 ఏళ్ల వ్యక్తి ఒమిక్రాన్‌తో చనిపోయినట్టు అధికారులు నిర్ధారించారు.
తాజావార్తలు
-
Nissan Pixo: నిస్సాన్ పిక్సో విడుదల.. 259KM రేంజ్, 10-అంగుళాల డిస్‌ప్లే, Gemini వాయిస్ అసిస్టెంట్.. ఫీచర్లు ఇవే
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
-
Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
-
Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
-
UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!