తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏకంగా భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్‌ను విమర్శిస్తూ ఆమె మాట్లాడటం ప్రస్తుతం రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ.. అంబేద్కర్ వల్ల మనకు ఎలాంటి హక్కులు రాలేదన్నారు. అంబేద్కర్ వల్ల సాధ్యం కానివి బాబూ జగ్జీవన్ రాం వల్ల సాధ్యమయ్యాయని ఎమ్మెల్యే శ్రీదేవి వ్యాఖ్యానించారు.
Read Also: అశోక్ గజపతిరాజుకు హైకోర్టులో ఊరట
ఈరోజు మనకు రాజ్యాంగ హక్కులు వచ్చాయంటే కారణం బాబూ జగ్జీవన్ రాం అని వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పష్టం చేశారు. బాబూ జగ్జీవన్‌రాంను ఆదర్శంగా తీసుకుని ప్రజలందరూ ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు. కాగా ఎమ్మెల్యే శ్రీదేవి వ్యాఖ్యలపై అంబేద్కర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా గతంలోనూ వినాయకుడిపై ఎమ్మెల్యే శ్రీదేవి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.