ప్రపంచ దేశాలను దక్షిణాఫ్రికాకు చెందిన కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తోంది. భారత్‌లోనూ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాలలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో కొత్తగా ఐదు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 67కి చేరింది. ఒమిక్రాన్ సోకిన బాధితులను ప్రభుత్వం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది.
Read Also: మళ్లీ కరోనా కల్లోలం.. ఆ రాష్ట్రాలకు కేంద్రం లేఖ
మరోవైపు ఇండియాలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య వెయ్యి దాటింది. ఈరోజు మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో 198 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 450కి చేరింది. ఈ నేపథ్యంలో ముంబైలో ఇప్పటికే ప్రభుత్వం 144 సెక్షన్ కూడా విధించింది. కాగా వచ్చే రెండు నెలల్లో తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని గురువారం డీహెచ్ శ్రీనివాసరావు వెల్లడించిన సంగతి తెలిసిందే. పరిస్థితులు చూస్తుంటే త్వరలో కరోనా థర్డ్ వేవ్ తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.