ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, ఏపీ ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ కోరాడు. థియేటర్ల సమస్యలపై ప్రభుత్వం నెలరోజులు సమయం ఇవ్వడం సంతోషంగానే ఉన్నా… థియేటర్ల సీజ్ అంశంపై పని ఒత్తిడిలో ఉండే జాయింట్ కలెక్టర్‌లను కలిస్తే ఉపయోగం ఏం ఉంటుందని ప్రశ్నించారు. కరోనాతో రెండేళ్ల పాటు ఎన్నో ఇబ్బందులు పడ్డామని.. ఓటీటీ కారణంగా ఎన్నో నష్టాలకు గురయ్యామని ఎన్వీ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: అశోక్ గజపతిరాజుకు హైకోర్టులో ఊరట
ఇటీవల పలువురు ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలు సినీపరిశ్రమను బాధ పెట్టే విధంగా ఉన్నాయని ఎన్వీ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై కొందరు హీరోలు స్పందించడం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లోని థియేటర్ల పరిస్థితి మరింత ఘోరంగా తయారైందన్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వానికి హీరో నాని క్షమాపణ చెప్పాలన్న నిర్మాత నట్టి కుమార్‌పై ఎన్వీ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలంటే నట్టికుమార్‌ను తెలంగాణలో ప్రత్యేక ఛాంబర్ పెట్టుకోవాలని హితవు పలికారు.