దేశంలోనే అతిపెద్ద రియాలిటీషోలలో బిగ్‌బాస్ ఒకటి. ఈ షోకు ఏ భాషలో అయినా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇటీవల తెలుగు బిగ్‌బాస్-5 సీజన్ ముగిసింది. వీజే సన్నీ విజేతగా… యూట్యూబర్ షణ్ముఖ్ రన్నరప్‌గా నిలిచారు. మరోవైపు ఈ సీజన్ ఫినాలే ఎపిసోడ్‌కు టీఆర్పీ రేటింగ్ బాగానే వచ్చింది. చాలా మంది సెలబ్రిటీలు ఫినాలే ఎపిసోడ్‌కు రావడంతో ప్రేక్షకులు టీవీకి అతుక్కుపోయారని టీఆర్పీని చూస్తే అర్ధమవుతోంది. బ్రహ్మాస్త్ర టీమ్, పుష్ప టీమ్, పరంపర వెబ్ సిరీస్ టీమ్, శ్యామ్ సింగరాయ్ టీమ్‌తో పాటు రాజమౌళి, అక్కినేని నాగచైతన్య వంటి ప్రముఖులు హాజరుకావడంతో ఫినాలే ఎపిసోడ్ 18.4 టీఆర్పీ నమోదు చేసింది.
Read Also: ‘వాలిమై’ ట్రైలర్: అజిత్ హాలీవుడ్ రేంజ్ యాక్షన్
అయితే ఇప్పటివరకు బిగ్‌బాస్ అన్ని సీజన్‌లలో నాలుగో సీజన్ ఫినాలే ఎపిసోడ్ అత్యధిక టీఆర్పీ నమోదు చేసింది. గత సీజన్‌లో అభిజిత్ విన్నర్‌గా.. అఖిల్ రన్నరప్‌గా నిలవగా ఫినాలే ఎపిసోడ్ ఏకంగా 19.51 టీఆర్పీ నమోదు చేసింది. నాలుగో సీజన్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రావడమే భారీస్థాయిలో టీఆర్పీ రావడానికి కారణమైందని టాక్. మరోవైపు మూడో సీజన్ ఫినాలే ఎపిసోడ్‌కు 18.29 టీఆర్పీ, నాని హోస్ట్‌గా వ్యవహరించిన రెండో సీజన్ ఫినాలే ఎపిసోడ్‌కు 15.05 టీఆర్పీ, ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించిన ఫస్ట్ సీజన్ ఫినాలే ఎపిసోడ్‌కు 14.13 టీఆర్పీ వచ్చింది. కాగా త్వరలోనే బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.